BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్! రూ.249 తో 45 రోజుల వ్యాలిడిటీ! మరెన్నో ప్రయోజనాలు!

Header Banner

BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్! రూ.249 తో 45 రోజుల వ్యాలిడిటీ! మరెన్నో ప్రయోజనాలు!

  Mon Jul 01, 2024 21:07        Gadgets

ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా గత వారం తమ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ రీఛార్జీ ధరలను భారీగా పెంచాయి. జియో, ఎయిర్‌టెల్‌ పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానుండగా, వోడాఫోన్‌ ఐడియా కొత్త ధరలు జులై 4 నుంచి అమలు కానున్నాయి. ఈ సందర్భంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

 

ఇంకా చదవండి: SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!

 

BSNL తాజాగా ₹249 తో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే ఈ ప్లాన్‌ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. 90GB డేటాను పొందవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

 

ఇంకా చదవండి: ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు జులై 3 నుండి అమల్లోకి రానున్నాయి!

 

గత నెలలో BSNL రెండు ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ₹108, ₹107 ధరల్లో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. BSNL వినియోగదారులు ₹108 తో రీఛార్జీ చేయించుకుంటే రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి SMS లను ఉచితంగా అందించడం లేదు. అయితే లోకల్‌ SMS లకు 80 పైసలు, నేషనల్ SMS కు ₹1.20 వసూలు చేస్తారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. తక్కువ ధరలో మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్న ప్లాన్‌లలో ఇది ఒకటిగా ఉంది. BSNL ₹107 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం లేదు. 200 నిమిషాల పాటు మాత్రమే ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు మొత్తం 3GB డేటాను పొందవచ్చు. అయితే BSNL ట్యూన్స్‌ ను పొందవచ్చు. మరియు ఈ ప్లాన్‌లో ఎటువంటి ఉచిత SMS ప్రయోజనాలు అందుబాటులో లేవు. ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది.

 

ఇంకా చదవండి: Infinix జీరోబుక్‌ అల్ట్రా! సరికొత్త ల్యాప్‌టాప్‌ స్మార్ట్ ఫీచర్లతో! భారత మార్కెట్లో విడుదల!

 

BSNL యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 4G సర్వీసులను ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పంజాబ్‌లో 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ మెరుగైన ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పంజాబ్‌లో సుమారు 8 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది. భారత ప్రభుత్వం టెలికాం పరిశోధన సంస్థ CDoT మరియు ఐటీ సంస్థ TCS ల కన్సార్షియం రూపొందించిన స్వదేశీ టెక్నాలజీతోనే BSNL ఉపయోగిస్తోంది. ఈ కన్సార్షియం తయారుచేసిన క్లిష్టమైన టెక్నాలజీ పూర్తి స్థాయిలో స్థిరపడేందుకు (Stabilize) 12 నెలల సమయం పడుతుండగా, కేవలం 10 నెలల్లోనే స్టెబిలైజ్‌ అయిందని అధికారులు తెలిపారు. ఈ ఆత్మనిర్బర్ భారత్‌ విధానంలో BSNL 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్‌ అయ్యేలా రూపొందించారు. 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనున్నారు. పటిష్ఠంగా 4G నెట్‌వర్క్‌ ను విస్తరించేందుకు పూర్తి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

 

ఈనెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు! గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై!

 

జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!

 

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

 

AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #TelecomUpdate #BSNL #4GLaunch #RechargePlans #IndianTelecom #DigitalIndia #TelecomNews #CustomerBenefits #TechUpdate #MobileData