ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. వచ్చే శుక్రవారం నుంచే ప్రసారం! ఎందులోనంటే?

Header Banner

ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. వచ్చే శుక్రవారం నుంచే ప్రసారం! ఎందులోనంటే?

  Sun Jul 14, 2024 15:39        Entertainment

సౌదీలో ఓ వలస కార్మికుడు ఎదుర్కొన్న దారుణ అనుభవాలను తెరకెక్కించిన సినిమా ‘ఆడు జీవితం’.. నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో వలస కార్మికుడిగా సుకుమారన్ నటనకు విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. బ్లెస్సీ దర్శకత్వంలో రూ.82 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సినీ వర్గాల అంచనా. మార్చి నెలాఖరున ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా బాగుందనే టాక్ నేపథ్యంలో మూవీ లవర్స్ ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగు నెలలు గడిచిన తర్వాత తాజాగా ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ పై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఆడు జీవితం సినిమా ఈ నెల 19 (వచ్చే శుక్రవారం) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని నిర్దారిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది.

ఇంకా చదవండి: సంచలన విషయాన్ని ప్రకటించిన నరేష్-పవిత్రా లోకేష్! రూ.1500 కోట్ల ఆస్తి ఉండటంతోనే!


రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించిన బ్లెస్సీ..
న‌జీబ్ మహ్మ‌ద్ అనే మలయాళీ యువకుడి జీవితంలో వాస్తవంగా జరిగిన సంఘటనలను బెన్యామిన్ అనే రచయిత ‘గోట్ డేస్’ పేరుతో ఓ నవల రాశారు. 2008లో మలయాళంలో అత్యధికంగా అమ్ముడుపోయిన నవలగా ఇది రికార్డులు సృష్టించింది. ఈ నవల హక్కులు కొనుగోలు చేసిన డైరెక్టర్ బ్లెస్సీ.. దాదాపు పదేళ్లకు పైగా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆపై పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కించారు.


ఇంకా చదవండి: రాయలసీమకు మరో శుభవార్త! రూ.4వేల కోట్ల పెట్టుబడితో విన్‌ఫాస్ట్ ఈవీ యూనిట్! ఇక ఉద్యోగులకు కొరత ఉండదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలనంగా మారిన ట్రంప్‌పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. లైవ్ లో రికార్డ్ అయిన సంఘటన! వెంటనే ఆదేశాలు జారీ చేసిన వైట్ హౌస్!

 

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

 

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

 

చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Adujeevitham #Prithvirajsukumaran #OTTRelease #Entertainment #MovieNews