సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ లకు, యూట్యూబ్ చానెల్స్ కు భారీ షాక్! త్వరలోనే ఆ చట్టం అమలు!

Header Banner

సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ లకు, యూట్యూబ్ చానెల్స్ కు భారీ షాక్! త్వరలోనే ఆ చట్టం అమలు!

  Mon Aug 05, 2024 20:53        Entertainment

ప్రసార సేవలకు సంబంధించిన నియంత్రణ బిల్లుపై ఇప్పుడు మరోసారి కదలిక వచ్చింది. అయితే.. కేంద్రం తేనున్న కఠిన నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు రానున్నట్టు తెలుస్తోంది. భారత్ లో లోక్సభ ఎన్నికల సమయంలో పలురకాల యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సైతం తమకు వ్యతిరేకంగా పనిచేశారని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుందా..? అందుకే ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదని భావించినట్టు ఉంది కాబోలు..?

 

యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలా చేయడం వల్లనే ప్రతిపక్షాలకు కూడా బాగా హెల్ప్ అయ్యిందన్న భావనతో కేంద్రం ఓ కొత్త చట్టాన్ని తేవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయానికి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న గోప్యత కారణంగా ఈ సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి సోషల్ మీడియా వరకూ.. మోడీ ప్రభుత్వం మీద ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. 'ప్రసార సేవల నియంత్రణ బిల్లు' తొలి ముసాయిదా గతేడాదే విడుదలైంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.! అయితే మొన్న లోకసభ ఎనికలు రావటంతో ఈ కొత్త బిల్లు యొక్క అంశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

 

ఇంకా చదవండిఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

 

భారత ప్రభుత్వం సవరించిన ఆ బిల్లు మాత్రం ఇప్పటకీ బయటకు రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా మొదట వెల్లడించాల్సి ఉంటుంది. తర్వాత ప్రజానీకం నుంచి సానుకూల భావన రావాలి. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం వాటిని తప్పకుండా స్వీకరించాలి. ఇవన్ని పనులు చేసిన తరువాతనే సమీక్ష జరిపి, అప్పుడు కానీ బిల్లుకు తుదిరూపం ఇవ్వరు. కానీ, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి ప్రక్రియ జరగడం లేదని విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

 

సోషల్ మీడియా వేదికలు అయినటువంటి యూట్యూబ్, ఇన్స్టా, తదితర సోషల్ మీడియా వేదికల్లో.. జనాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తించనున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు తమ పూర్తి వివరాలను ప్రభుత్వానికి ఇచ్చి నమోదు చేసుకోవలసి ఉంటుంది.

దీంతోపాటు డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మొదలైన వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను ప్రభుత్వాధికారులు ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. అక్కడున్న పరికరాలు, ఉపకరణాలు వేటినైనా కూడా స్వాధీనం చేసుకునే హక్కును ఈ చట్టం అధికారులకు కల్పిస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై నిషేధం అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని.. ఈ సోషల్ మీడియా వేదికల కంపెనీలన్నీ అందించాల్సి ఉంటుంది.

అయితే.. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ చట్టం ద్వారా సోషల్ మీడియా వేదికలు అయినటువంటి మెటా, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టా వంటి వేదికలకు ఇబ్బందులు తప్పనట్టే.!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్‌వి ఫేక్ పనులు..ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ఫేక్ గాళ్ల ఈ సమాజానికి చీడపురుగులు! తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్, చంద్రబాబు!

 

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండిఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Entertainment #Youtube #Instagram #SocialMedia