సోషల్‌మీడియాలో ఈ రోగం మీకు కూడా ఉందా? అయితే తొందరగా దాన్నుంచి బయటపడండి!

Header Banner

సోషల్‌మీడియాలో ఈ రోగం మీకు కూడా ఉందా? అయితే తొందరగా దాన్నుంచి బయటపడండి!

  Wed Dec 18, 2024 13:50        Life Style

లైక్‌లే నిజాలు అనుకుంటున్నారా? కామెంట్లే కొలమానాలుగా భావిస్తున్నారా? రోజుకో డీపీ మార్చుకుంటూ… వర్చువల్‌ ఇమేజ్‌ను పెంచుకుంటూ పోతున్నారా? ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే.. మీరు బిల్డప్‌ బుల్లెమ్మలే! డిజిటల్‌ చట్రంలో ఇరుక్కుపోతే ఎప్పుడో ఫేక్‌ అయిపోతారు జాగ్రత్త!! ఈ తరం యువతీయువకుల్లో ఈ ఫేక్‌ ఐడెంటిటీ భావన వారికి తెలియకుండానే ముదిరిపోతున్నదట! లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటూ, తమ వాస్తవ పరిస్థితిని అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోతున్నారట. వర్చువల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేయలేక మనోవ్యథకు గురువుతున్నారట!! 

 

శ్రావ్య కాస్త బొద్దుగా ఉంటుంది. ముద్దుగానే ఉంటుంది. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో మాత్రం స్లిమ్‌గా, హాట్‌గా కనిపించే పిక్‌లు పెడుతుంది. వాటికొచ్చే లైక్‌లు, కామెంట్లు చూసుకొని మురిసిపోతుంది. వర్చువల్‌ ఇమేజ్‌ కోసం సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, నిజమేంటో ఆమెకు తెలుసు. ఆ నిజం ఆమెను ఒత్తిడికి గురిచేస్తున్నది!! 

 

విశాల్‌ మధ్యతరగతి అబ్బాయి. ఒకరోజు ఫ్రెండ్‌ బైక్‌ మీద ైస్టెల్‌గా రేబాన్‌ కళ్లజోడు పెట్టుకుని తీసుకున్న సెల్ఫీ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టాడు. ఏఐ ఎడిటింగ్స్‌తో సాదాసీదా బాడీకి ఫిట్‌నెస్‌ కూడా అద్దాడు. హీరోలా కనిపించేసరికి విపరీతంగా లైక్‌లు వచ్చిపడ్డాయి. అమాంతంగా వచ్చిన స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. ఫ్రెండ్స్‌తో షాపింగ్‌ మాల్స్‌ చుట్టేస్తూ, కారులో విహరిస్తూ.. దిగిన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ పోయాడు. ఫాలోవర్లూ పెరిగారు. కానీ, అతను పెట్టుకున్న కళ్లజోడు, తిరుగుతున్న కారు.. ఇవేవీ తనవి కావు. కానీ, సోషల్‌ మీడియాలో చూసేవారంతా విశాల్‌ రేంజ్‌ వేరని ఫిక్సయ్యారు. అంతేకాదు, తనని కూడా అలా ఫిక్సయ్యేలా భ్రమ కల్పించారు. కానీ, విశాల్‌ మనసులో ఏదో ఒక మూల తెలియని అశాంతి. దీంతో తను ఇష్టంగా తొక్కే సైకిల్‌తో సెల్ఫీ తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. 

 

వర్చువల్‌ ప్రపంచంలో విహరిస్తున్న యువతీయువకులు కూడా అచ్చం శ్రావ్య, విశాల్‌ లాగానే ప్రవర్తిస్తున్నారు. ఫేక్‌ ఐడెంటిటీని మాస్క్‌లా తగిలించుకొని సోషల్‌ దునియాను దున్నేస్తున్నామని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ డిజిటల్‌ అట్రాక్షన్స్‌కు ఎక్కువగా గురవుతున్నారని పలు సర్వేలు హెచ్చరిస్తున్నాయి. తమను తాము ఓ బ్రాండ్‌గా ప్రొజెక్ట్‌ చేసుకోవాలనే తపనే.. చాలామంది అమ్మాయిలను సోషల్‌ లైఫ్‌కు దగ్గర చేస్తున్నదని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ ప్రపంచంలో ఒకలా, సోషల్‌ మీడియాలో మరొకలా వ్యవహరిస్తూ.. ఒక్కరిలోనే ఇద్దరు ఉంటున్నారు. మీలోనూ ఆ ఇద్దరు ఉన్నారా? 

 

సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలని చాలామంది ఆరాటం. బయట ఎలా ఉన్నా.. ఎఫ్‌బీ, ఇన్‌స్టాల్లో ఆదర్శభావాలను వల్లిస్తుంటారు. ఎక్కడో బ్రౌజింగ్‌లో కనిపించిన కొటేషన్లను స్టేటస్‌గా పెట్టేసి గొప్పగా ఫీలవుతారు. దాన్ని ఎంతమంది చూశారు, ఎవరెలా రెస్పాండ్‌ అయ్యారు అని తరచూ చెక్‌ చేసుకుంటూ ఉంటారు. నాలుగు లైక్‌లు రాగానే నెట్టింట్లో అందరూ తమనే ఫాలో అవుతున్నారని ఊహించుకుంటారు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ఆ కొటేషన్‌లో చెప్పిన ఆదర్శభావాలు పాటిస్తున్నామా అన్న ప్రశ్న ఉదయించగానే మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఈ క్రమంలో డిజిటల్‌ ప్రపంచంలో సంపాదించుకున్న డమ్మీ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, తమ రియల్‌ లైఫ్‌ను అంగీకరించలేరు. 

 

ఇంకా చదవండిఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

 

ఇంకా చదవండికీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పరిధి దాటొద్దు 
వాస్తవ ప్రపంచంలో అయినా.. సోషల్‌ వరల్డ్‌ లో అయినా.. స్థిమితంగా ఉండటం అవసరం. పదే పదే డీపీ మార్చేయడం, అదేపనిగా స్టేటస్‌ చెక్‌ చేయడం.. లాంటి వైఖరులు సోషల్‌లైఫ్‌లో మీరు స్థిరంగా లేరన్న దానికి సంకేతంగా భావించాలి. ఎవరిదో బెంజి కారు పార్క్‌ చేసి ఉంటే సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు కొందరు. దానికొచ్చే లైక్‌లు, కామెంట్లతో ఎంజాయ్‌ చేస్తారు. ఈ ఆర్భాటం మీ జీవితాన్ని అగాథంలోకి నెట్టే ప్రమాదం ఉంది. 

 

లేనిది ఉన్నట్టుగా చూపించాలనుకోవడం ప్రమాదకరం. వర్చువల్‌ లైఫ్‌ను ఆస్వాదించడం మొదలైతే.. వాస్తవ జీవితంలోకి రావడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే.. రకరకరాల ఫిల్టర్లు, కెమెరా ఆప్షన్లు వాడి మీ అసలు ముఖాన్ని చెరిపేశారు. మీ ఫాలోవర్లు మీ వాస్తవ రూపం చూడాలనుకుంటే మీరెలా స్పందిస్తారు? ఆ పరిస్థితే వస్తే ఫేస్‌ చేయగలరా? ఆ ఒత్తిడిని తట్టుకోగలరా? 

 

మీరో బ్రాండ్‌ అవ్వడం అంటే.. మీదైన ప్రత్యేకతను చాటుకోవాలి. అంతేకానీ, అరువు తెచ్చుకున్న అందాలను అద్దుకొని మురిసిపోవడం కాదు! మీకున్న టాలెంట్‌తో సోషల్‌ వేదికల్లో పరిచయమవ్వండి. నిజాయతీగా ప్రయత్నిస్తే ఎప్పటికైనా మీరు ఆశించిన సెలెబ్రిటీ హోదా దక్కుతుంది.

మరో మాట… పనివేళల్లో, ఆఫీస్‌ కంప్యూటర్స్‌లో సోషల్‌ మీడియా సర్వీసులను యాక్సెస్‌ చేయొద్దు.

సామాజిక మాధ్యమాల్లో లైక్‌లే పరమావధిగా ఏది పడితే అది షేర్‌ చేయొద్దు. ఓ పరిధి మేరకే విషయాలను పంచుకోవాలన్న విషయాన్ని గ్రహించాలి.

వర్చువల్‌లో ధరించిన ఫేక్‌ ముసుగు.. రియల్‌ వరల్డ్‌లో మీ ఇమేజ్‌ని అమాంతం నేలకు దించేస్తుందని మర్చిపోవద్దు. 

 

ఎడిటింగ్‌ మాయ కొంత
సోషల్‌ మీడియా మయసభను మించిన మాయా ప్రపంచం! కృత్రిమ మేధకు దత్త సంతతిలా పుట్టుకొచ్చిన ఎడిటింగ్‌ ఫీచర్లు అస్ర్తాలుగా చాలామంది రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. ఫేక్‌ పోస్టింగులు పెడుతున్నారు. లావుగా ఉన్నవాళ్లు మెరుపుతీగలా కనిపించేలా మాయ చేస్తున్నారు. బానపొట్టతో ఉన్న పురుషుడి ఫొటో ఏఐ సాయంతో సిక్స్‌ప్యాక్‌లోకి మారిపోతున్నది. వీటిని ఫాలో అయ్యేవారు ఆ క్షణం మురిసిపోయి లైక్‌ కొట్టి ఊరుకుంటారు. అక్కడితో వాళ్ల పాత్ర ముగిసిపోతుంది. ఆ లైక్‌ల ప్రభావంతో ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోతున్నారు కొందరు. అయితే ఈ ఫేక్‌ ఎన్నోరోజులు నిలబడదు. సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఉన్న మీరు.. అసలైన మీరు కాదని ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఏదో ఒకరోజు.. ‘అది నేను కాదు!’ అన్న నిజాన్ని మీరు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనసు, మెదడూ రెండూ ప్రశ్నిస్తాయి. మీరు ‘ఒక్కరా? ఇద్దరా?’, ‘నీ నిజ స్వరూపం ఏది?’ అని. అప్పటికైనా వాస్తవం గుర్తించగలిగితే ఫర్వాలేదు. ఇంకా భ్రమల్లోనే ఉంటామంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా రేపు ఉదయం 11 గంటలకి..

 

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

 

రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #SocialMedia #Life #SocialSkills