తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటున్నారా? అయితే ఆ సమస్యకు దగ్గరగా ఉన్నట్టే!

Header Banner

తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటున్నారా? అయితే ఆ సమస్యకు దగ్గరగా ఉన్నట్టే!

  Sun Jul 14, 2024 07:00        Health

బియ్యం అంటే మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు మూడు పూటలా పళ్లెంలో తెల్లగా మెరిసిపోతూ తళతళలాడుతున్న అన్నాన్ని తింటుంటాం. అయితే ఒకప్పుడు మన పూర్వీకులు దంపుడు బియ్యమే తినేవారు. చూడటానికి అవి బాగోవు.. ఆరోగ్యాన్నిస్తాయి. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం చూడటానికి ఎంతో అందంగా కనపడతాయి.. అనారోగ్యాన్నిస్తాయి. వాటికీ వీటికి అదే తేడా. దంపుడు బియ్యం అంటే పోషకాల గని. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో ఖనిజాలు, విటమిన్లు ఎన్నో ఉంటాయి. మనం వడ్లను పాలిష్ పట్టించేటప్పుడు ఇవన్నీ వెళ్లిపోతాయి. అందుకే దంపుడు బియ్యమే తినాలంటూ ఎంతోమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. వారానికి ఐదుసార్లు లేదంటే అంతకన్నా ఎక్కువ తెల్ల బియ్యం తీసుకుంటే షుగరు వస్తుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. తెల్లబియ్యాన్ని తగ్గించుకొని దానిస్థానంలో దంపుడు బియ్యం తీసుకుంటే షుగరు వచ్చే ముప్పు 16 శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు.

 

ఇంకా చదవండి: విస్కీని మినరల్ వాటర్‌తో కలుపుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉంటుంది. నియాసిన్, విటమిన్ బీ3 లాంటివాటితోపాటు ఎముకలను ఆరోగ్యంగా ఉండే మెగ్నీషియం కూడా దంపుడు బియ్యంలో ఉంటుంది. దంపుడు బియ్యంలో సెలీనియం ఉంటుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి ఇది తోడ్పడుతుంది. అలాగే వీటిల్లో లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్ ఎంటెరోలాక్టేన్ గామారి క్యాన్సర్ ను నివారిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. దంపుడు బియ్యంలో ఉండే పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజు స్థాయిలు కూడా త్వరగా పెరగవు. తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలిగి ఆకలి కూడా వేయదు. ఇలా ఈ బియ్యం తినడంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజురోజుకు తెల్ల బియ్యాన్ని తగ్గించి దంపుడు బియ్యాన్నే తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి: ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

 

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

 

చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Health #Rice #TIps