టాయిలెట్ లోకి మొబైల్ పట్టుకెళ్తున్నారా? ప్రమాదం.. జాగ్రత్త! ఫోన్ వినియోగంతో రోగాలు ఖాయం!

Header Banner

టాయిలెట్ లోకి మొబైల్ పట్టుకెళ్తున్నారా? ప్రమాదం.. జాగ్రత్త! ఫోన్ వినియోగంతో రోగాలు ఖాయం!

  Mon Jul 15, 2024 07:00        Health

మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక అడిక్షన్ లా తయారైంది. మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది అత్యవసరంగా మారింది. ఒకగంట సేపు ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది. అది ఎంతలా అంటే 24గంటలు ఫోన్ లోనే తలపెట్టి చూసేంత వ్యసనంగా, ఫోన్ లేకపోతే ప్రపంచ ఆగిపోతుందేమో అన్నంత అదిగా మొబైల్ ఫోన్ వ్యసనం పెరిగిపోయింది. ఇక మొబైల్ ఫోన్ ను ఎక్కువగా వాడడం అలవాటు ఉన్నవారు చివరకు బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా మొబైల్ ఫోన్లను తీసుకువెళ్తుంటారు. టాయిలెట్లో ఫోన్ చూస్తూ గంటల సమయం బయటకు రాకుండా గడుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదాలు, సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి ఫోన్లో చూస్తూ కూర్చుంటారో వారు ఖచ్చితంగా రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.

 

ఇంకా చదవండి: తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటున్నారా? అయితే ఆ సమస్యకు దగ్గరగా ఉన్నట్టే!

 

టాయిలెట్లోకి ఫోన్ తీసుకు వెళ్లినప్పుడు టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా గాలి ద్వారా మన ఫోన్ పైకి చేరుతుంది. దీనివల్ల ఆ బాక్టీరియా మనం మాట్లాడుతున్నప్పుడు చేతులతో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మన చేతుల నుంచి మన కడుపులోకి చేరుతుంది. దీనివల్ల డయేరియా, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, మరికొన్ని అంటు వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. టాయిలెట్లలో మనకు తెలియకుండానే కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. బాత్రూంలో కూర్చుని ఫోన్ మాట్లాడినప్పుడు అది మన ముక్కు, నోరు ద్వారా మన కడుపులోకి వెళ్తుంది. ఫలితంగా రోగాల బారిన పడటం సంభవిస్తుంది. ఇంతే కాదు టాయిలెట్ లో కమోడ్ మీద గంటల కొద్దీ కూర్చుంటే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ ను వినియోగించాలనుకునేవారు అతిగా వినియోగించడం ప్రమాదం అనే విషయాన్ని గుర్తించాలి. అంతేకాకుండా ముఖ్యంగా టాయిలెట్లకు వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.


ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలనంగా మారిన ట్రంప్‌పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. లైవ్ లో రికార్డ్ అయిన సంఘటన! వెంటనే ఆదేశాలు జారీ చేసిన వైట్ హౌస్!

 

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

 

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

 

చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Health #TIPs #PhoneUsing