వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త! ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

Header Banner

వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త! ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

  Tue Jul 16, 2024 07:00        Health

వర్షాకాలంలో వాతావరణం చల్లగా, హాయిగా అనిపిస్తుంటుంది. అనువైన వాతావరణంతో శరీరం చల్లబడి తాజా తాజాగా అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఫుడ్ పాయిజనింగ్, కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వానాకాలం సంబంధిత రోగాలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఆహార భద్రతను పాటించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని ముఖ్యమైన చిట్కాలు సూచిస్తున్నారు.

 

శుభ్రమైన నీటినే తాగాలి..
వర్షాకాలంలో కలుషిత నీటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే కలుషిత నీటిని తాగితే మన శరీరం వ్యాధులకు నిలయం అవుతుంది. అందుకే సురక్షితమైన నీటిని మాత్రమే తాగుతున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలి. వేడి చేసి చల్లార్చిన, ఫిల్టర్ చేసిన, బాటిల్ వాటర్ మాత్రమే తాగాలి. నమ్మకం లేని వీధి వ్యాపారాల వద్ద నీటిని తాగకపోవడం చాలా చాలా మంచిది. ఇంటి దగ్గరే మంచి నీరు అని నిర్ధారించుకున్నాకే తాగడం బెటర్.

 


ఆహారాన్ని చక్కగా ఉడకనివ్వాలి..
వానాకాలంలో ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వండడం చాలా ముఖ్యం. తద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు నశించిపోతాయి. మాంసం, సముద్రపు ఆహార ఉత్పత్తులను కనీసం 75 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వండాలి. ఇందుకోసం ఫుడ్ థర్మామీటర్‌ని ఉపయోగించడం ఉత్తమం. అలాగే సరిగ్గా ఉడకని గుడ్లను తినడం ప్రమాదకరం. ఇక మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనుకుంటే కచ్చితంగా వేడి చేసిన తర్వాత మాత్రమే తినాలి.

ఇంకా చదవండి: టాయిలెట్ లోకి మొబైల్ పట్టుకెళ్తున్నారా? ప్రమాదం.. జాగ్రత్త! ఫోన్ వినియోగంతో రోగాలు ఖాయం!

 

కూరగాయలను శుభ్రంగా కడగాలి..
వర్షాకాలంలో సాధారణంగా కూరగాయలు, పండ్లపై ఉండే తేమ ఉంటుంది. ఈ కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల, పరాన్నజీవులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా పండ్లు కూరగాయలు మారే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని శుభ్రంగా కడగాలి. వెజిటబుల్ బ్రష్‌ను ఉపయోగించి కూరగాయలు, పండ్లను రుద్ది రుద్ది కడగడం చాలా మంచిది. ఇక ఆకు కూరలను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ ద్రావణంలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరం.


కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది..
సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించడంలో వంటగది పరిశుభ్రత చాలా ముఖ్యమైంది. కిచెన్‌లో అపరిశుభ్రతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. వంట పాత్రలు, కూరగాయలు కట్ చేసే బోర్డులు అన్నింటినీ వేడి నీరు, సబ్బు లేదా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలి. ఇక ఆహారం తినడానికి, వంట పాత్రలను ముట్టుకోవడానికి ముందు చేతలను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

 

ఆహారం నిల్వ విషయంలో జాగ్రత్త..

వానాకాలంలో ఆహారం కలుషితం కాకుండా నివారించాలంటే సరైన రీతిలో నిల్వ చేయడం అనివార్యం. 
పాల ఉత్పత్తులు, మాంసాహారాలు వంటి త్వరగా పాడైపోయే ఆహారాలను 4 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా  అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచుకోవడం ఉత్తమం. ఆహారాన్ని నిల్వచేసుకునే చోట తేమ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆహారంలోకి గాలి వెళ్లే అవకాశం లేని పాత్రలను ఎంచుకోవాలి. ముడి, వండిన ఆహార పదార్థాలను వేరు చేసుకోవడం ఇంకా ముఖ్యం.


ఇంకా చదవండి: ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!

 

ఏపీలో మద్యంతర ఎన్నికలు అంటూ వైసీపీ నేత కామెంట్స్! ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఈ రైళ్లకు అదనపు బోగీలు!

 

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ తమ్ముడు అరెస్ట్! గోవా కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా!

 

ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించిన FBI! ఐడీ కార్డులు లేకుండా ఎలానో తెలుసా?

 

పైకి చూస్తే పూలతోట.. లోన మాత్రం కథ వేరే! గొప్పోడివయ్యా సామీ! మనోడి తెలివిని చూసిన పోలీసులు షాక్!

 

పిల్లలు సంపాదించే ఆదాయం పరిధిలో వచ్చే నియమాలు ఏంటి? ఆదాయ పన్ను చెల్లించాలా? ఆ వివరాలు మీకోసం!

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్! ఇక నుంచి సులువుగా దర్శనం, గదులు! తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RainySeasonHealth #Tips #HealthCare #Health #NewsRainyseason