మీ పిల్లలు కంప్యూటర్స్, మొబైల్ స్క్రీన్స్ అతిగా చూస్తున్నారా? కొత్త పరిశోధనలో విస్తుపోయే విషయాలు!

Header Banner

మీ పిల్లలు కంప్యూటర్స్, మొబైల్ స్క్రీన్స్ అతిగా చూస్తున్నారా? కొత్త పరిశోధనలో విస్తుపోయే విషయాలు!

  Sun Nov 24, 2024 10:00        Health

విపరీతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగం వల్ల ప్రజలు ఎక్కువగా స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. కంప్యూటర్, మొబైల్ వంటి సాధనం ఏదైనా వాటి స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది చిన్నపిల్లలలో మరిన్ని దుష్ప్రభావాలకు కారణమవుతుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. చిన్న వయస్సు నుంచే పిల్లలు ఎక్కువగా స్క్రీన్‌ చూస్తుంటే వారు ఓ భారీ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ఎలుకలపై తాజాగా జరిపిన ఓ అధ్యయనం పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌ల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువ కాలం అలవాటుపడితే వారిలో త్వరగా యుక్తవయస్సు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఆ రిపోర్ట్ షాక్ ఇచ్చింది. లివర్‌పూల్‌లోని 62వ వార్షిక యూరోపియన్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ మీటింగ్‌లో ఈ పరిశోధన వివరాలు రిలీజ్ అయ్యాయి.

 

ఇంకా చదవండి: సొంతంగా మందులు వాడుతున్నారా? అయితే ప్రమాదమే! డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

 

కంప్యూటర్, మొబైల్స్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్‌ వల్ల పిల్లల్లో ఎముకల పెరుగుదల వేగవంతం అవుతుందని అధ్యయనంలో తేలింది. తద్వారా సాధారణంగా కంటే ముందే చిన్నారులలో యుక్తవయస్సు ప్రారంభమయ్యే ప్రమాదం పెరుగుతుందని పరిశోధన నివేదిక వెల్లడించింది. ఇది పిల్లలలో ఎముకల పెరుగుదల మరియు యుక్తవయస్సు అభివృద్ధి మధ్య సంబంధాన్ని అన్వేషించిన మొదటి రీసెర్చ్‌గా టర్కీలోని గాజీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ అయ్లిన్ ఉగుర్లు చెబుతున్నారు. ఈ పరిశోధనలు ఎలుకలపై నిర్వహించబడినందున పిల్లలలో పునరావృతమవుతాయని ఖచ్చితంగా చెప్పలేము. అయితే ఎక్కువ కాలం బ్లూ లైట్‌ని చూడటం వల్ల శారీరక పెరుగుదల మరియు పరిపక్వత రెండూ వేగవంతం అవుతాయి. ఇది త్వరగా యుక్తవయస్సు ప్రారంభ అయ్యేందుకు దారితీస్తుందని మా డేటా సూచిస్తుంది' అని ఉగుర్లు స్పష్టం చేశారు.

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HealthCare #TIps #HotWaterBathing