షుగర్ తగ్గించుకునే క్రమంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు! తర్వాత చాలా బాధ పడతారు!
Fri Jan 03, 2025 15:09 Healthషుగర్... ఈ పేరు వింటేనే ప్రస్తుతం అందరూ తెగ భయపడుతున్నారు. జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డయాబెటీస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవైపు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు ఆహారంలో చక్కెరను వీలైనంత పరిమితం చేసుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో చాలా మంది తెలియక చేస్తున్న తప్పుల వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండే బదులు పెరుగుతున్నాయి. ఫలితంగా చక్కెర నియంత్రణ ఉద్దేశం నెరవేరట్లేదు. మనం సాధారణంగా చేస్తున్న తప్పులు ఏమిటో తెలుసుకొని వాటిని నివారిస్తే... తీపి తినాలన్న కోరికను లేదా తృప్తిని త్యాగం చేయాల్సిన అవసరం లేకుండానే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కృత్రిమ స్వీటెనర్లు వద్దు..
చక్కెర బదులు కృత్రిమ స్వీటెనర్ల వాడకం మంచి ప్రత్యామ్నాయం లాగానే కనిపిస్తుంది. కానీ దాని పర్యవసానాలు మాత్రం ప్రతికూల ఫలితాలు కలిగించే అవకాశం ఉంది. కృత్రిమ స్వీటెనర్లు మనలో తీపి పదార్థాలు తినాలన్న కోరికను విపరీతంగా పెంచుతాయి. అలాగే చక్కెరపై శరీర సహజ స్పందనకు అవాంతరాలు కలిగిస్తాయి. అందువల్ల సహజమైన తీపిని అందించే తాజా పండ్లను తినడంపై దృష్టి పెట్టండి. పండ్లు తియ్యదనంతోపాటు శరీరానికి అవసరమైన పీచు పదార్థాలను, పోషకాలను అందిస్తాయి.
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో దాగి ఉండే చక్కెరతో జాగ్రత్త..
చాలా రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఫ్రక్టోస్, మాల్టోస్ లేదా కేన్ సిరప్ లాంటి వేర్వేరు పేర్లతో చక్కెర దాగి ఉంటుంది. గ్రనోలా బార్స్ లేదా యోగర్ట్ లాంటి చాలా ఆరోగ్యకరమైనవిగా చెప్పబడే ఉత్పత్తుల్లో కృత్రిమంగా కలిపిన చక్కెర ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలు తింటే ఇక షుగర్ నియంత్రణ సాధ్యం కాదు. అందుకే ఆహార ఉత్పత్తులపై ఉండే పోషక విలువల లేబుల్స్ లో ఏం ఉందో జాగ్రత్తగా పరిశీలించాలి. వీలైనంత తక్కువగా లేదా చక్కెరలు కలపని ఆహార ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలి.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: ఈ పండ్లు వేర్వేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది! కలిపి తింటే ఇంక అంతే!
ఒక్కసారిగా మానొద్దు..
రోజువారీ ఆహారంలో తీసుకునే చక్కెరను తినడం ఒక్కసారిగా మానొద్దు. అలా చేస్తే తలనొప్పి, చికాకు వంటివి కలుగుతాయి. అలాగే మరింతగా ఆహారం తినాలన్న కోరిక పుడుతుంది. అందుకే శరీరం, రుచి గ్రంథులు అలవాటు పడేలా దశలవారీగా చక్కెర తినడాన్ని తగ్గించుకోండి. టీ లేదా కాఫీలో చక్కెర వాడకాన్ని తగ్గించుకోవడంతో మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. చక్కెరతో కూడిన స్నాక్స్ బదులు ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోండి.
పస్తులు ఉండొద్దు
చక్కెర నియంత్రణ కోసం కొందరు ఓపూట భోజనం మానేస్తుంటారు. కానీ ఈ చర్య విపరీతమైన ఆకలికి దారితీస్తుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికను మరింత పెంచుతుంది. సమతుల, అధిక ప్రొటీన్లతో కూడిన ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే మరింతగా తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అందుకే అధిక పోషకాలతో కూడిన భోజనం తినడంపై దృష్టిపెట్టండి.
చిరుతిండ్లకు స్వస్తి పలకండి
బాగా ఆకలేస్తోందని చాలా మంది చిరుతిండ్లు తింటుంటారు. దీనివల్ల చక్కెర నియంత్రణ సాధ్యంకాదు. అందుకే చిరుతిండ్లకు స్వస్తి పలకండి. ఒకవేళ తినాలనుకుంటే ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోండి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే గింజలు, చీజ్ స్టిక్స్ లేదా కూరగాయల ముక్కలు తినండి. వాటిని తినడం వల్ల మరింత తినాలన్న ఆకలి వేయదు. తద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!
ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!
గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!
శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!
ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!
టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Health #Diabetes #SugarLevels #BloodSugar #DiabetesPatients
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.