అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!

Header Banner

అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!

  Tue Jun 25, 2024 15:51        U S A

అమెరికాను వరద ముప్పు వీడట్లేదు. ఐయోవా, సౌత్ డకోటా, మిన్నోసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలో ది ర్యాపిడాన్ డ్యామ్ ప్రవాహతీవ్రతకు బద్దలైపోయింది. ఆ డ్యాం పరీవాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఈ ఘటనలో డ్యామ్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, సౌత్ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదలోనే ఉంది. ఇటీవలే ఐయోవాలో వచ్చిన వరదల్లో వ్యక్తి కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. స్పెన్సర్, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 11 వేల మంది జలదిగ్బంధంలోకి వెళ్లారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సియోక్స్ నగరంలోని రైల్ రోడ్ వంతెన నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది. ఇది ఐయోవా నుంచి సౌత్ డకోటాలోని ప్రాంతాలను కలుపుతుంది. 1993లో వచ్చిన వరదల కన్నా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఐయోవా గవర్నర్ కిమ్ రేనోల్డ్స్ అన్నారు. వరద నీరు మొత్తం మిస్సోరీ, మిసిస్సిప్పీ నదిలోకి చేరనుంది. సియోక్స్, ఐయోవాలో భారీగా వర్షాలు పడ్డాయి. విడతల వారీగా కురిసిన భారీ వర్షాల వల్లే పరిస్థితి ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేల పూర్తిగా తేమతో నిండిపోవడంతో.. భూమిలోకి నీరు ఇక ఇంకని పరిస్థితి ఏర్పడి వరదగా మారిందన్నారు.

 

ఇవి కూడా చదవండి 

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

 

షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే! 

 

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

 

‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక! 

 

మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త! 

 

ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు! 

  

పులివెందులలో జగన్ కు ఊహించని షాక్! సొంత పార్టీ నేతలే ఇలా చేశారా! ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్! 

                                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants