అమెరికా డ్రోన్ల ప్రదర్శనలో పెనుప్రమాదం! అనేకమంది ఆసుపత్రిలో చికిత్స!

Header Banner

అమెరికా డ్రోన్ల ప్రదర్శనలో పెనుప్రమాదం! అనేకమంది ఆసుపత్రిలో చికిత్స!

  Tue Dec 24, 2024 11:59        U S A

అమెరికాలో నిర్వహించిన ఓ డ్రోన్ల ప్రదర్శనలో ఊహించని ప్రమాదం జరిగింది. క్రిస్మస్ నేపథ్యంలో ఫ్లోరిడాలోని ఇయోలా సరస్సుపై ఏరియల్ లైట్ షోలో భాగంగా డ్రోన్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో దానిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో అనుకోకుండా గాలిలో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. అవి వేగంగా వచ్చి కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులపై పడడంతో ఏడేళ్ల బాలుడితో సహా పలువురు గాయాలపాలయ్యారు. గాయపడిన పిల్లాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #drones #show #usa #todaynews #flashnews