అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!

Header Banner

అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!

  Tue Dec 24, 2024 15:30        U S A

అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఐస్ లేక్ కు వెళ్లి గుంటూరు కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఐస్ లేక్ పై నడుస్తుండగా ఐస్ విరిగిపోయి ఎస్.మోహన వెంకట అభిషేక్ నీటిలో పడిపోయాడు. మొత్తం 9 మంది స్నేహితులు ఈ ఐస్ లేక్ ను చూసేందుకు వెళ్ళగా అందులో ముగ్గురు లేక్ లో పడిపోయారు. అందులో ఇద్దర్ని కాపాడగలిగారు. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది. ఈ సంఘటన వుడ్స్ క్యానియన్ లేక్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సంఘటన జరిగిన 3 గంటల తరువాత సహాయక బృందాలు వచ్చారని, త్వరగా సహాయం అంది ఉంటే కాపాడగలిగేవారని వైద్యులు వెల్లడించారు. ఈ విషయంపై ఏపీ ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎన్నారై టీడీపీ ప్రతినిధులు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ సంతాపం తెలియజేశారు. మృతదేహాన్ని తరలించేందుకు అక్కడ ఉన్న అసోసియేషన్ లతో పాటు NRI టిడిపి మెంబర్లకు బాధ్యతలు అప్పగించామని, వీరు వీలైనంత త్వరగా డాక్యుమెంటేషన్ పనులు కంప్లీట్ చేసి దేహాన్ని ఇండియాకు వీలైనంత త్వరగా తరలిస్తారని ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తెలిపారు. మృతుని దేహాన్ని తరలించడానికి అవసరమయ్యే నిధులను సమీకరించడానికి గో ఫండ్ ను కూడా రైజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొడుకు చనిపోయిన వార్త విని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారు.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

కాగా, అసలే ఇది హాలిడే సీజన్ కాబట్టి, చాలామంది హాలిడే మూడ్ లో వివిధ రకాల ట్రిప్పులు ప్లాన్ చేస్తుంటారు లేదా ప్రయాణాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఆ ఆనందంలో అతి చిన్న తప్పిదాలు చేస్తూ ఇలాంటి ప్రమాదాలకు లోనవుతుంటారు. వీరు చేసే చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి కొత్త ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలి అని అదేవిధంగా వారి తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని ఈ సందర్భంగా చప్పిడి రాజశేఖర్ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants