అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

Header Banner

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

  Mon Jan 13, 2025 16:06        U S A

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్‌ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్‌ ఏంజెల్స్‌ మరభూమిని తలపిస్తోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదవుతున్నాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ విపత్తును కొందరు అవకాశంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుండటం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 

 

ఇంకా చదవండిమీకు పీఎఫ్ ఖాతా ఉందా! ఫ్రీగా మీ అకౌంట్‌లోకి రూ.50 వేలు వచ్చేస్తాయి! 

 

బిలియనీర్లు, హాలీవుడ్‌ స్టార్స్‌ వదిలేసి వెళ్లిన ఇళ్లను దోపిడీ దొంగలు దోచుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక పోలీసులకు ఇది ఓ సవాల్‌గా మారింది. కార్చిచ్చు కారణంగా జనాలను రక్షించడంతోపాటు ఇటు దొంగతనాలను అరికట్టాల్సి రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్‌ చేశారు. అందులోని ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్ట్‌ చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు షరీఫ్‌ డిపార్ట్‌మెంట్‌ గస్తీలను నిర్వహిస్తోంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

24కు పెరిగిన కార్చిచ్చు మృతులు 
వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ప్రాణనష్టం సైతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కార్చిచ్చులో మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. మరణించిన వారిలో అత్యధికంగా ఏటోన్‌ ఫైర్‌లోనే 16 మంది కాగా, పాలిసేడ్స్‌లో 8 మంది ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదాల్లో సుమారుగా 16 మంది తప్పిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంటల ధాటికి ఇప్పటి వరకూ 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, పాలిసేడ్స్‌లో 23,707, ఏటోన్‌లో 14,117ఎకరాలు, కెన్నెత్‌లో 1,052, ముర్సెట్‌లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!

 

టాలీవుడ్ కి షాక్.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్! ఎందుకు అంటే!

 

మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!

 

ఏపీ మహిళలకు ఊరట కలిగే నిర్ణయం.. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలుఈనెల 18 నుంచి ప్రారంభం.. దీని వల్ల చాలా మందికి.!

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants