గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పుపై కీలక ప్రకటన! గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ వ్యూహాలు..!

Header Banner

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పుపై కీలక ప్రకటన! గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ వ్యూహాలు..!

  Tue Jan 21, 2025 20:39        U S A

ట్రంప్ అందరూ ఊహించినట్లే తొలిరోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని వ్యాఖ్యానించారు. ఆయన జనవరిలో మార్ ఎ లాగో ఎస్టేట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వేళ తొలిసారి ఈ విషయాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రదేశాలను మాదక ద్రవ్యాల ముఠాలు నియంత్రిస్తున్నాయని తాను అమెరికా సరిహద్దులను బలోపేతం చేస్తానని వెల్లడించారు. ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరు ఇది. తొలిసారి ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్కు చెందిన అన్వేషకులు వినియోగించారు. ఈనేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనలను మెక్సికో తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాట్లాడుతూ.. 1607లో గల్ఫ్ ఆఫ్  మెక్సికో పేరును వాడిన మ్యాప్లను చూపించారు.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?


గతంలో కూడా అమెరికాను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించేవారని పేర్కొన్నారు. 'మౌత్ ఆఫ్ రియో గ్రాండ్' అనే ప్రదేశంలో అమెరికా, మెక్సికోల మధ్య దీని సరిహద్దులు మొదలవుతాయి. అమెరికా ఆర్థికవ్యవస్థకు ఈ ప్రదేశం అత్యంత కీలకమైంది. ఈ ప్రదేశంలో అమెరికాలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే దొరుకుతుంది.
గ్రీన్ ల్యాండ్ విషయంలో డెన్మార్క్ కలిసివస్తుంది..
గ్రీన్ ల్యాండ్ను కొనుగోలు చేసే విషయంలో తమతో పాటు డెన్మార్క్ కూడా కలిసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఓవల్ ఆఫీస్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ “గ్రీన్ ల్యాండ్ ఓ అద్భుత ప్రదేశం. అంతర్జాతీయ భద్రత కోసం ఇది అమెరికా అధీనంలో ఉండటం చాలా అవసరం. ఈవిషయంలో మాతో డెన్మార్క్ కలిసొస్తుంది అని కచ్చితంగా నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్ బృందం ఒకసారి గ్రీన్ల్యాండ్కు వెళ్లి చర్చలు జరిపింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబులోకేష్! ఎందుకో తెలుసా ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #trump #gulfofmexico #name #change #greenland #todaynews #flashnews #latestupdate