ట్రంప్ నిర్ణయాలతో భారతీయులపై ప్రభావమెంత? మొదటి దెబ్బ పడినట్టే! అమెరికా వెళ్లాలనుకునే వారికి, అక్కడ ఉన్న వారికి షాక్!
Wed Jan 22, 2025 17:12 U S Aఅమెరికా 47 వ అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చేయగానే డోనాల్డ్ ట్రంప్ అన్నట్లుగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మొదటి దెబ్బ వేసాడు.
అమెరికా లో పుట్టగానే పౌరసత్వం రాదు ఇకముందు!
1.అమెరికన్ పౌరులకి పుట్టిన వాళ్లకి మాత్రమే ఆటోమేటిక్ గా పౌరసత్వం వస్తుంది.
2.పేర్మినెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్ కార్డ్ ఉన్న వారి పిల్లలకి పౌరసత్వం ఆటోమేటిక్ గా వస్తుంది.
3.H1B వీసా, స్టూడెంట్ వీసా, ఏదన్నా వర్క్ వీసా మీద అమెరికా వెళ్లిన వాళ్లకి అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమాటిక్ గా పౌరసత్వం రాదు.
4.ఈ రోజు నుండి గ్రీన్ కార్డ్ పొందడం అనేది చాలా కష్టం. ఇప్పటి కే పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా ఆమోదం పొందడం కష్టం!
5.ఇక ముందు H1B వీసా దొరకడం కూడా కష్టం!
6.ఇప్పటికే H1B వీసా మీద అమెరికా లో ఉన్న వాళ్లకి రెన్యువల్ అవడం కూడా కష్టం.
7.H1B వీసా కాల పరిమితి 6 సంవత్సరాలు పూర్తయిన వారిని బలవంతంగా వారి వారి దేశాలకి పంపించేస్తారు!
8.ఒక్క భారతీయులకే కాదు కానీ అన్నీ దేశాల వాళ్లకి ఇది కష్టకాలం. ఇప్పటి వరకూ H1B వీసా మీద అమెరికా వెళ్లి పనిచేస్తూ పెళ్లిచేసుకొని భార్యని కూడా అమెరికా తీసుకెళ్లి అక్కడే పిల్లలని కనడం, తరువాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయడం ఈ లోపున అంటే పదేళ్లకి గ్రీన్ కార్డ్ రావడం జరుగుతూ వచ్చింది కానీ ఇక నుండి అలా కుదరదు!
ఇంకా చదవండి: ట్రంప్ కార్యవర్గం నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి! కారణం ఇదేనా?
ఈ రోజు ట్రంప్ ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే!
కానీ సుప్రీం కోర్టు సమర్థిస్తుందా? ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి ట్రంప్ ఆర్డర్ కనుక పూర్తి స్థాయిలో అమలు కావాలి అంటే! అంటే ఇది సుదీర్ఘమైన పోరాటం అవబోతున్నది అన్నమాట!
సిలికాన్ వాలీ పెద్దలు ముందుగా సుప్రీం కోర్ట్ తలుపు తడతారు అన్నది నిజం. ఎందుకంటే మొదట నష్టపోయేది వాళ్ళే!
ఇక స్టూడెంట్ వీసా కోసం భారత్ లోని బ్యాంకులలో అప్పు చేసి , అమెరికా లో చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ నెట్టుకొద్దాము అనే వాళ్లకి ఆశాభంగం తప్పదు. త్వరలో అమెరికన్ యూనివర్సిటీ లో చదవాలి అంటే భారం అవవచ్చు!
అమెరికా, బ్రిటన్ దేశాలలోని యూనివర్సిటీలు ముస్లిం దేశాలనుండి భారీగా విరాళాలు స్వీకరిస్తూ నెట్టుకొస్తున్నాయి!
ఈ విరాళాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాడు ట్రంప్.
గత రెండేళ్లుగా అమెరికా, బ్రిటన్ లలోని యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తిన జెండాలు పట్టుకొని ' RIVER To SEA 'అనే ప్ల కార్డులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలకి దిగిన సంగతి తెలిసిందే!
ఇంత చేస్తే ఆ River to Sea కి అర్ధం ఏమిటీ అని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు శుంఠ లు.
అసలు river అంటే జోర్దాన్ నది అనీ, Sea అంటే మధ్యదరా సముద్రం అనే విషయం తెలీదు వీళ్ళకి. జోర్దాన్ నది మధ్యదరా సముద్రం మధ్యలో ఉన్న భూమి పాలస్తిన అని ప్రచారం చేసుకున్నారు. ఆ శుంఠ లలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు!
వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే యూనివర్సిటీ ఫీజులు పెంచేసి, ముస్లిం దేశాల నుండి విరాళాలు తీసుకోకుండా చేస్తే బసగుటుంది అనే ప్రతిపాదన ఉంది. ఇదే జరిగితే భారతీయ విద్యార్థులు అక్కడి ఖర్చులకి సరిపడా డబ్బు సమకూర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సారి చదువు అయిపోయిన తరువాత ఎవరికి వారు వాళ్ళ దేశాలకి వెళ్ళిపోవాలి. ఉద్యోగ అవకాశం వస్తే మళ్ళీ వీసా తీసుకొని అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది!
అమెరికా అల్లుడు, కోట్ల రూపాయల కట్నాలకి తాత్కాలికంగా తెర పడుతుంది అనుకోవచ్చు! అదే సమయంలో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళ కి భారీగా కట్నాలు ఇవాళ్సి ఉంటుంది ఆడపిల్లల తల్లి తండ్రులకి!
H1B వీసా ఉన్న వాళ్లకి డిమాండ్ పడిపోతుంది!
OTHER SIDE OF COIN!
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని టాయిలెట్ పేపర్ తో పోలుస్తున్నారు నిపుణులు!
ముందు ఫెడరల్ కోర్టు లు అంగీకారం తెలపాలి!
అయితే రాజ్యాంగం సవరించకుండా ట్రంప్ ఆర్డర్ చెల్లదు అనే తీర్పు వస్తుంది మరో మూడేళ్ళకి!
కోర్టు తీర్పు ని అనుసరించి రాజ్యాంగ సవరణ చేయాలి అని ట్రంప్ అనుకున్నా అది అంత సులభంగా జరిగేపని కాదు.
ఎలాగంటే....
- UNITED STATES CONSTITUTION 14th AMENDMENT
All persons born or naturalized in the United States, And subject to the jurisdictions thereof, are citizens of United States and the state where they reside.
ఇది అమెరికా 14 వ రాజ్యాంగ సవరణ లో ఉన్నది.
పోనీ రాజ్యాంగ సవరణ చేద్దామని అనుకున్నా అదీ జరిగే పని కాదు.
- 291 మంది కాంగ్రెస్ సభ్యులు + 67 మంది సెనేటర్ల మద్దతు కావాలి. అంటే 68 మంది డెమోక్రాట్ హౌస్ సభ్యులు మరియు 23 మంది డెమోక్రాట్ సెనేటర్ల మద్దతు కావాలి.
11.ఇక 223 మంది రిపబ్లికన్ సభ్యులు హౌస్ లో మరియు 53 మంది రిపబ్లికన్ సెనేటర్స్ మద్దతు కూడా కావాలి.ఆఫ్కోర్స్ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కూడా వోటింగ్ లో పాల్గొనాలి.
- పైన చెప్పినవి మొదటి మెట్టు. రెండవ మెట్టులో 2/3 మెజారిటీ ఉండాలి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 34 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. వీటిలో 5 రాష్ట్రాలు డెమోక్రాట్స్ చేతిలో ఉన్నాయి!
ఇంకా చదవండి: అమెరికాలోని భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్! 18 వేల మంది బహిష్కరణ!
సాధ్యమా?
ఎన్నికల హామీ నెరవేర్చాడు ట్రంప్ అంతే!
బహుశా KCR గారు స్ఫూర్తి ఇచ్చి ఉంటారు తెలంగాణ రాగానే రామోజీ ఫిల్మ్ సిటీ ని లక్ష నాగళ్ళతో దున్నుతాను అని కానీ లక్ష నాగళ్లు లభ్యం కాలేదు. ట్రంప్ కూడా మాట ఇచ్చాను నెరవేర్చ్చాను కానీ నాకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి అది పూర్తిగా నెరవేర్చలేకపోయాను అంటాడు. ఎటూ కోర్టు తీర్పు వచ్చే సరికి నాలుగేళ్లు పడుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి.
నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే....
ఎలాన్ మస్క్ తన టెస్లా ఎలక్ట్రిక్ కారుని ఎలాంటి దిగుమతి సుంకం లేకుండా చైనా నుండి భారత్ లోకి అనుమతించేలా పరోక్షంగా వత్తిడి తెస్తున్నాడు.
రెండేళ్ల క్రితం ఎలాన్ మస్క్ మోడీజీ తో సమావేశం అయ్యాడు. అప్పట్లో తన ఎలక్ట్రిక్ కారుని దిగుమతి సుంకం లేకుండా భారత్ లోకి అనుమతించమని కోరితే దానికీ మోడీజీ జవాబు ఇస్తూ మీరు భారత్ లో తయారుచేసి అమ్ముకోండి అంతే కానీ చైనా నుండి దిగుమతికి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు.
ప్రస్తుత వీసా ఆర్డర్ వల్ల ఎక్కువగా నష్టపోయేది భారత్ మాత్రమే!
అయితే నాలుగేళ్లు ఇబ్బంది ఉండవచ్చు లేదా ట్రంప్ ఆర్డర్ అమలు కాకుండా కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే మూడు నెలల ఇబ్బంది ఉంటుంది!
ట్రంప్ అధికారంలోకి వచ్చినా మనమేమి సంబర పడనవసరం లేదు.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #AmericaNewShip #NewShip #USANews #Travel #World #BigShip #Titanic #TitanicShip #TitanicBigShip
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.