యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

Header Banner

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

  Sat Jun 22, 2024 07:30        U A E

మహిళలకు సంబంధించి కఠిన చట్టాల అమలు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెనక్కి తగ్గింది. అబార్షన్ లపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, వివాహేతక సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతి ఇచ్చే తీర్మానాన్ని యూఏఈ ప్రభుత్వం ఆమోదించింది. ఆ కేసుల్లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. గర్భం దాల్చిన వెంటనే ఈ విషయాన్ని అధికారులతో చెప్పాలని ఆ తీర్మానంలో ఉంది. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి తీసుకురావాలని తెలిపింది. మహిళల ఆరోగ్య దృష్ట్యా 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అనుమతి కల్పించింది. మహిళ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. యూఏఈలో కనీసం ఏడాది నుంచి ఉంటున్న మహిళలకు మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అత్యాచారం, వివాహేతర సంబంధం లాంటి కేసుల్లో దోషులకు శిక్ష పడేలా కఠిన చట్టాలున్నాయని యూఏఈ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాకపోతే, ఈ నేరాల వల్ల మహిళలు ప్రెగ్నెంట్ అయితే ఆ సమస్య పరిష్కరించేందుకు చట్టాలు కావాలని పేర్కొన్నాయి. అందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించాయి. కాగా, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం యూఏఈ చట్టాల ప్రకారం, అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే జీవితఖైదు విధిస్తారు. అదే బాధితురాలు మైనర్ లేదా దివ్యాంగురాలు అయితే మరణశిక్ష వేస్తారు.

 

ఇవి కూడా చదవండి 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే! 

 

శాసన సభకు రాకూడదని నిర్ణయించుకున్న జగన్! రేపు పులివెందుల పర్యటన! 

 

బాపట్ల జిల్లా: చీరాల రామాపురం బీచ్ లో అలల ఉద్రిక్తత! నలుగురు యువకులు గల్లంతు! 

 

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి! 

 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates