కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే?

Header Banner

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే?

  Tue Jul 09, 2024 22:19        Others

అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతో పాటు లీజుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లిన వారు సొంతిల్లు కొందామంటే ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు, వలసదారులు నగర శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరైతే ఈ అద్దెల భారాన్ని భరించలేక దేశాన్నే వదిలి వెళ్లిపోతుండడం గమనార్హం. ఇళ్ల అద్దెలను భరించలేక కెనడాను వదిలేస్తున్నవారి సంఖ్య 28 శాతంగా ఉన్నట్లు ఆంగస్‌ రీడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే చాలా మంది ఇతర దేశాల వైపు మళ్లుతున్నట్లు పేర్కొంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అమెరికా తర్వాత భారతీయులను ఎక్కువగా ఆకర్షించేది కెనడా. ఏటా లక్షలాది మంది యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పెరిగుతున్న ఇళ్ల అద్దెలు ప్రవాస భారతీయులకు కష్టంగా మారుతున్నాయి. పెద్ద ఉద్యోగాలు దొరక్కపోయినా పార్ట్‌ టైమ్ ఉద్యోగాలు చేసైనా సంపాదించుకుందాని అక్కడికి వెళ్తోన్న భారతీయులు అద్దెలను చూసి బెంబేలెత్తుతున్నారు. కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయుల సంఖ్య పదేళ్లలో అంటే 2023 నాటికి 1,39,715కి చేరింది. దశాబ్దకాలంలో ఏకంగా 326 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చోటుచేసుకున్న ఇళ్ల అద్దెల సంక్షోభం ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇంకా చదవండి:  రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

2021 ఎన్నికల సమయంలో కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది కెనడా వాసులు ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు కెనడాలో ఇల్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్ పార్టీ పేర్కొంది. దీంతో సంపన్నులు, విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారని తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా ధరలు భారీగా పెరిగాయని వివరణ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత కెనడావాసులు కాని వారు ఇళ్లు కొనడంపై నిషేధం అమలు చేసింది. మరోవైపు.. కెనడాకు వసలదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని 44.5 శాతం మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు. భారత్ నుంచి కనెడాకు వెళ్లిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఓ సంఘంగా ఏర్పడ్డారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. 

 

ఇంకా చదవండి: భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి! ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని..రామ్మోహన్

 

ఇళ్ల ధరలే కాదు ఉద్యోగ కల్పనలోనూ కెనడాలో ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిరుద్యోగ సూచీ 29 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మే నెలలో ఇది 6.3 శాతంగా నమోదు కాగా.. జూన్‌లో 6.4గా నమోదైంది. యువతలో నిరుద్యోగ రేటు 0.9 నుంచి 13.5 శాతానికి చేరిందని ఓ నివేదిక తెలిపింది. ఇటీవల చేపట్టిన ఉద్యోగుల వేతనాల పెంపు.. నియామకాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ ఏడాది మేలో గంటల ప్రాతిపదికన ఉద్యోగుల వేతనాన్ని 5.2 నుంచి 5.6 శాతానికి పెంచారు. ఈ వేతనాల పెంపు నియామకాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో ఉద్యోగాల కోసం కెనడా వెళ్లే భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

 

ఇవి కూడా చదవండి 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

 

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చ‌ర్య‌ల‌కు ఆదేశం!

 

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం! 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్!

 

దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా అదే! కాంగ్రెస్ ట్వీట్!

 

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

 

అమెరికాలో విషాదం... మరో తెలుగు విద్యార్ధి మృతి! గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన...

 

ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Canada #Employment #WorkPermit #Immigrants #IndianMigrants