దారుణం! 42 మందిని అతి కిరాతకంగా హత్య చేసి! చెత్తకుప్పలో...

Header Banner

దారుణం! 42 మందిని అతి కిరాతకంగా హత్య చేసి! చెత్తకుప్పలో...

  Sun Jul 21, 2024 12:03        Others

కెన్యాలోని నైరోబీ (Nairobi's) లో దారుణంగా మహిళలను హత్య చేస్తున్న సైకో సీరియల్ కిల్లర్ (psychopathic serial killer) గురించి బయటపడింది. రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను చంపి చెత్త కుప్పల్లో పారేస్తున్న నిందితుడు 33 ఏల్ల కొల్లిన్స్ జమైసీ కాలుషా అరెస్టయ్యాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడి గురించి విస్తుపోయే నిజాయలు బయటకొచ్చాయి. 42 మందిని హత్య చేసినట్లు అంగీరించాడు. అతడికి ప్రాణం అంటే లెక్కలేదని అధికారులు చెప్తున్నారు. కాగా.. ఇటీవలే, తొమ్మిది మంది మహిళల మృతదేహాలను నైరోబీలోని ముకురూ (Mukuru) ప్రాంతంలో చెత్తకుప్పలో గుర్తించారు. ఈ ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే శిథిలమైన గదిలో కాలుషా అద్దెకు ఉండేవాడు. అనుమానం వచ్చిన అధికారులు ఇంట్లో సోదాలు చేయగా.. పోలీసులకు కొడవలి, పరిశ్రమల్లో వాడే రబ్బరు గౌజులు, భారీ సంఖ్యలో సెల్లోటేప్స్, నైలాన్ కవర్స్ లభించాయి. డెడ్ బాడీలను పారేసేందుకు వీటినిమృతదేహాలను పారేసే క్రమంలో వీటిని వినియోగించినట్లు గుర్తించారు. ఇకపోతే, 2022 నుంచి ఇప్పటివరకు నిందితుడు 42 మంది మహిళలకు వలవేసి లొంగదీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాక, వారిని హత్యచేసినట్లు వెల్లడించారు. వారి డెడ్ బాడీలను ఆనవాలు లేకుండా ఛిద్రంచేసి సమీపంలోని డంపింగ్ యార్డులో పడేసేవాడని వివరించారు. చంపిన మహిళల్లో నిందితుడి భార్య కూడా ఉన్నట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితుడి నివాసంలో సెల్ ఫోన్లను కూడా గుర్తించామన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

26 ఏళ్ల జోసఫ్ వైనో అనే మహిళ ముకురు ప్రాంతం నుంచి అదృశ్యమైంది. దీంతో, ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ యువతి బయటకు వెళ్లేందుకు ముందు ఓ కాల్ వచ్చినట్లు గుర్తించారు. బాధిత కుటుంబం అభ్యర్థన మేరకు పోలీసులు చెత్తకుప్పల్లో గాలింపు చేపట్టారు. దీంతో మహిళల అయవాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొత్తం నరికి శరీర భాగాలు ఉన్నాయని అధికారులకు నివేదిక అందించింది. వారిలో ఒకరిని గొంతు కోసి చంపినట్లు తేలింది. కాగా.. డీఎన్ఏ పరీక్షల్లో కేవలం రెండు డెడ్ బాడీలనే పోలీసులు గుర్తించారు. మిగితావి కుళ్లిపోవడంతో వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, డెడ్ బాడీలు బయటపడ్డ డంపింగ్ యార్డు పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఉండటం గమనార్హం. చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

 

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

 

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

 

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Africa #SerialKiller #Murders #Murdered #Danger #Kenya