కోల్కతా హత్యాచార దర్యాప్తులో సుప్రీం కీలక ఆదేశాలు! వాస్తవాల వెలికితీతకై సమయం కోరిన న్యాయస్థానం!

Header Banner

కోల్కతా హత్యాచార దర్యాప్తులో సుప్రీం కీలక ఆదేశాలు! వాస్తవాల వెలికితీతకై సమయం కోరిన న్యాయస్థానం!

  Tue Sep 17, 2024 18:09        Others

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి విచారణ జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదని, నిజాన్ని వెలికితీసేందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని ఈసందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే బాధితురాలి ఫొటో, పేరును వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ను సీబీఐ తాజాగా సమర్పించింది. దానిలో పేర్కొన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. వాస్తవాలను వెలికితీయడం దర్యాప్తు లక్ష్యమని వెల్లడించింది. ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)ను అరెస్టు చేశారని, దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచిచూద్దామని తెలిపింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీబీఐకి కేసు అప్పగించడం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయని, కేసులో పురోగతి పరిమితంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
మహిళలకు నో నైట్ షిఫ్ట్ ఆదేశాలు.. బెంగాల్ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం
హత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ లేకుండా చూసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ నోటిఫికేషన్ ను వెంటనే సవరించుకోవాలని ఆదేశించింది. "మహిళలు రాత్రిపూట పనిచేయకూడదని మీరు ఎలా చెప్తారు? వారికి ఈ పరిమితులు ఎందుకు? వారు మినహాయింపులు ఏమీ అడగలేదు. ఆ షిఫ్టుల్లో పనిచేయడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. వారికి భద్రత కల్పించడమే దీనికి పరిష్కారం. అదే మీ విధి. పలు విభాగాల్లో మహిళలు రాత్రి వేళ విధులు నిర్వర్తిస్తున్నారు” అని బెంగాల్ ప్రభుత్వం చర్యను న్యాయస్థానం విమర్శించింది.
వికీపీడియాకు ఆదేశాలు..
“ఏ రూపంలో కూడా బాధితురాలి వివరాలు బయటకు వెల్లడించకూడదు. ఈ ఘటనలో ఆమెకు సంబంధించి ఫొటో, ఆమె గుర్తింపు వెల్లడిచేసే ఏ వివరాన్నైనా సరే వికీపీడియా వెంటనే తొలగించాలి" అని కోర్టు ఆదేశించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై గత విచారణలోనూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఆర్జీ కర్లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై మరో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ప్రస్తుత విచారణ సందర్భంగా సీబీఐని ఆదేశించింది. నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారారహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారాఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికాయూరప్గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #delhi #court #kolkathacase #doctormurder #courtjudgement #todaynews #flashnews #latestupdate