లెబనాన్, సిరియాలో పేజర్ పేలుళ్ల సంచలనం! వాక్‌టాకీలపై దేశవ్యాప్తంగా నిషేధం!

Header Banner

లెబనాన్, సిరియాలో పేజర్ పేలుళ్ల సంచలనం! వాక్‌టాకీలపై దేశవ్యాప్తంగా నిషేధం!

  Fri Sep 20, 2024 09:53        Others

లెబనాన్ (Lebanon), సిరియాల్లో (Syria) ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు (Pagers) పేలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వరుస దాడులతో లెబనాన్ వణికిపోతోంది. అనూహ్యంగా జరుగుతున్న దాడులతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకొంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది.
దేశ రాజధాని బీరుట్ నుంచి టేకాఫ్ తీసుకునే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై పౌర విమానయాన అధికారులు నిషేధం విధించారు. ఎయిర్పోర్టులకు వచ్చే ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించనున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రయాణికులు పేజర్లు, వాకీటాకీలను తీసుకెళ్లడంపై నిషేధం కొనసాగుతుందని అధికారులు తాజాగా వెల్లడించారు. కాగా.. పశ్చిమాసియాలో లెబనాన్తో పాటు సిరియాలో వేలాది పేజర్లు పేలాయి. ఈ ఘటన నుంచి తేరుకునే లోపే లెబనాన్లో వాకీటాకీలు (walkie-talkie blasts) పేలిపోయాయి. దీంతో ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 3 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడులకు దిగింది ఇజ్రాయెలేనని భావిస్తున్నట్లు లెబనాన్ ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే Hezbollah ప్రతిదాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ ఆయుధ స్థావరాలపై రాకెట్లతో దాడి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #flights #lebanon #syria #pagers #hezbollah #walkietalkieblasts #todaynews #flashnews #latestupdate