కొవ్వూరు వినాయక నిమజ్జనంలో రాళ్ల దాడి కలకలం! ఘర్షణలో గాయపడిన పోలీసు అధికారులు!

Header Banner

కొవ్వూరు వినాయక నిమజ్జనంలో రాళ్ల దాడి కలకలం! ఘర్షణలో గాయపడిన పోలీసు అధికారులు!

  Fri Sep 20, 2024 10:19        Others

కొవ్వూరు పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడురోజుల కిందట పట్టణ రాజీవ్‌కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఊరేగింపు సమయంలో రాజీవ్‌కాలనీ, తునిపేటకు చెందిన రెండువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజీవ్‌కాలనీ నుంచి గురువారం మరో వినాయక విగ్రహం నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరింది.రాజీవ్‌కాలనీ నుంచి శ్రీరామకాలనీ మీదుగా వినాయకుడి శోభాయాత్ర దొమ్మేరు, కొవ్వూరు రాష్ట్ర రహదారికి వచ్చే దారిలో కొంతమంది అల్లరిమూకలు దారికాచి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాజీవ్‌కాలనీకి చెందిన చొక్కా నందకిశోర్‌ తలకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుట్లు పడ్డాయి. నందకిశోర్‌తో పాటు మరి కొంతమందికి గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పార్క్‌చేసిన పలకంశెట్టి సురేష్‌ స్కూటర్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పురపాలక సంఘానికి చెందిన ఇంటింటా చెత్త సేకరించే వాహనాన్ని ధ్వంసం చేశారు. రెండువర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బి. నరసింహకిశోర్‌ అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా పరిదిలోని పోలీసు యంత్రాంగాన్ని కొవ్వూరు రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. గురువారం రాత్రి పట్టణమంతా పోలీసులు భారీగా మోహరించారు.పోలీసు పికెటింగ్‌ ఏర్పాటుచేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #kovvuru #vinayaka #nimarjanam #dommeru #thunipeta #todaynews #flashnews #latestupdate