వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

Header Banner

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

  Mon Jan 13, 2025 12:40        Others

సంక్రాంతి సంబరాలకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తీసుకొస్తాయి ఈ పందాలు. ప్రభుత్వ అనుమతి లేకున్నా సంప్రదాయంలో భాగంగా ఏటా కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఈసారి సంక్రాంతికి ఒక్కరోజు ముందే పునకాలు లోడ్ అయ్యాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ బ్యాచ్ మొత్తం ఊళ్లలోకి దిగిపోయింది. కోడింగ్ పక్కకు పెట్టేసి.. కోళ్ల చుట్టూ చేరారు. కంపెనీలు, కర్మాగారాలు, సొంత బిజినెస్లు అన్నీ క్లోజ్... ఉపాధి కోసం పట్నం బాటపట్టిన వాళ్లంతా తిరిగి ఊళ్లకు వచ్చి బరుల దగ్గర సందడి చేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర షురూ అయింది. మనల్నెవడ్రా ఆపేది.. అంటూ కత్తులు కట్టుకుని కాలుదువ్వుతున్నాయి పందెం కోళ్లు. వందలు వేలు దాటి లక్షల్లో బెట్టింగులు కాస్తూ రెచ్చిపోతున్నారు పందెంరాయుళ్లు. ఒక పక్క పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నా లైట్ తీసుకుంటున్నారు పందెం నిర్వాహుకులు. ఇప్పటికే 10 వేలకు 20వేలు.. 50వేలకు లక్ష.. లక్షకు రెండు లక్షలంటూ పందెం రేట్లు కూడా ఫిక్స్ చేశారు నిర్వాహకులు. ఇక ఎక్కువ పందాలు గెలిచినవారికి ఆకర్షనీయమైన హుమతులు కూడా ఇస్తామంటున్నారు.



ఇంకా చదవండిమీకు పీఎఫ్ ఖాతా ఉందా! ఫ్రీగా మీ అకౌంట్‌లోకి రూ.50 వేలు వచ్చేస్తాయి!



గోదావరి జిల్లాల్లో అయితే ఖరీదైన బహుమతులు ప్రకటించారు. ఎక్కువ పందాలు గెలిచినవారికి బుల్లెట్, బైక్, రెండు కాసుల బంగారం బహుమతిగా అందించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బరులు సిద్ధం చేసిన నిర్వాహకులు... ఈసారి మరింత స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు. కోడి పందాలతో పాటు మహిళలకు కూడా భిన్నరకాల పోటీలు ఉంటాయని అంటున్నారు. ఇక భీమవరంలో క్రికెట్ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేస్తున్నారు. అరేంజ్ మెంట్స్ కూడా నెక్స్ట్ లెవల్లోనే ఉన్నాయి. దీంతో అందరి చూపు భీమవరం జరిగినే కోడి పందాలపైనే ఉంది. దీంతో భీమవరంలో నెల రోజుల క్రితమే హోటల్స్ ఫుల్ అయిపోయాయి. అప్పు అయినా దొరుకుతుందేమో గానీ... హెూటల్స్లో రూము దొరకడం మాత్రం కష్టంగా ఉందంటే సిచ్యూవేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ మూడు రోజులూ పందెం రాయుళ్లదే హవా. వీళ్ల హడావుడి ఈ రేంజ్లో ఉంటే... పోలీసులు కూడా ఈసారి తమ పవర్ చూపించడారికి రెడీ అవుతున్నారు. కాకపోతే... కోడిపుంజులకు వెనుక ఖద్దరు చొక్కాలున్నాయ్ కనుక.. ఈ సారి పండక్కి కూడా పుంజుమారాజుదే రాజ్యం కాబోతుంది.


ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!

 

టాలీవుడ్ కి షాక్.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్! ఎందుకు అంటే!

 

మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!

 

ఏపీ మహిళలకు ఊరట కలిగే నిర్ణయం.. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలుఈనెల 18 నుంచి ప్రారంభం.. దీని వల్ల చాలా మందికి.!

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #sankranthi #festival #pandhemkodi #westgodavari #todaynews #flashnews #latestupdate