ఇకపై ఫోన్‌లో నెంబర్ కాదు, పేరు కనిపిస్తుంది! స్పామ్ కాల్స్‌కి కొత్త పద్ధతి!

Header Banner

ఇకపై ఫోన్‌లో నెంబర్ కాదు, పేరు కనిపిస్తుంది! స్పామ్ కాల్స్‌కి కొత్త పద్ధతి!

  Sat Jan 18, 2025 11:45        Others

ఫోన్ లేని వాళ్లు ఎవరూ లేరు కదా.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నంది. ఇక నుంచి మీరు ఫోన్ చేస్తే కనిపించేది నెంబర్ కాదు.. మీరు, మీ వివరాలు. అవును.. ఈ దిశగా టెలికాం కంపెనీలు అమలు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయబోతున్నది. మీ ఫోన్ కాంటాక్ట్ ఉన్న నెంబర్లకు మాత్రమే పేరు కనిపిస్తుంది.. ఇది ఇప్పటి వరకు ఉన్న విధానం. ఇక నుంచి మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా.. వారి పేరు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఓ మార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది అనుకోండి.. ఇప్పుడు అయితే కేవలం నెంబర్ మాత్రమే కనిపిస్తుంది.. ఇక నుంచి ఆ మార్కెటింగ్ కంపెనీ పేరు, వారి వివరాలు డిస్ ప్లే అవుతాయి అన్నమాట. ఆ నెంబర్ ఏ పేరుతో అయితే రిజిస్ట్రర్ అవుతుందో.. పేరు కావొచ్చు.. కంపెనీ పేరు కావొచ్చు.. ఏదైనా కానీ..



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 



ఇక నుంచి పేరుతోనే మీ ఫోన్పై డిస్ ప్లే అవుతుంది అన్నమాట. ఫేక్ కాల్స్, మార్కెటింగ్ కాల్ను కట్టడి చేయటం కోసం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది కేంద్ర టెలికాం శాఖ. రోజు రోజుకు పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఈ మేరకు టెలీకాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలర్ ఐడీ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవను వెంటనే అమలు చేయాలని అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం.. మన ఫోన్లో ఒకరి నెంబర్ సేవ్ చేసుకుంటే.. వాళ్లు కాల్ చేసినప్పుడు మనం సేవ్ చేసుకున్న పేరు ఫోన్లో డిస్ ప్లే అవుతోంది. అదే మనం నెంబర్ సేవ్ చేసుకోకపోయిన.. తెలియని కొత్త నెంబర్ల నుండి ఫోన్ వచ్చిన కాల్ చేసింది ఎవరనే విషయం మనం గుర్తించలేం.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ప్రస్తుతం వంటి థర్డ్ పార్టీ యాప్ లు ఉపయోగించి కొత్త నెంబర్ల నుండి వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ యాప్లలో కూడా కాల్ చేసిన అవతలి వ్యక్తి వివరాలు అంత కరెక్ట్ తెలియజేస్తాయని చెప్పలేం. వీటిని ఆసరాగా తీసుకుని మార్కెటింగ్ చేసే వారు, సైబర్ నేరగాళ్లు కొత్త నెంబర్ల నుండి ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఈ స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ సమస్య వినియోగదారులకు తీవ్రం అవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కాలర్ ఐడీ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #phone #calls #fakecalls #spamcalls #todaynews #flashnews #latestupdate