దువ్వాడ పోలీస్ స్టేషన్‌లోనే చేతివాటం చూపించిన నిందితుడు! సీసీ ఫుటేజీలో చెక్ చేయగా...!

Header Banner

దువ్వాడ పోలీస్ స్టేషన్‌లోనే చేతివాటం చూపించిన నిందితుడు! సీసీ ఫుటేజీలో చెక్ చేయగా...!

  Sat Jan 18, 2025 21:03        Others

ఏదైనా వస్తువు చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం.. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.. ఆధారాలను సేకరించి.. దొంగలను పట్టుకుంటారు.. చోరీ సొత్తు రికవరీ చేసి ఆ దొంగను కటకటాల వెనక్కు పంపుతారు. మరి పోలీసుల వస్తువులే చోరికి గురైతే..? అది కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే..? అదే జరిగింది విశాఖ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో.. మహిళా కానిస్టేబుల్ మొబైల్ ను నొక్కేశాడు ఓ వ్యక్తి..
వివరాల్లోకి వెళ్తే.. జనవరి 13.. భోగి రోజు.. పండగ కావడంతో ఓ మహిళా కానిస్టేబుల్ దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేస్తోంది. ఇదే సమయంలో తన సెల్ ఫోన్ను టేబుల్ పై పెట్టింది. అయితే.. పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి జంక్షన్ వద్ద పేకాట శిబిరం నడుస్తోంది. కొంతమందిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే ష్యూరిటీ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన మానేపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి.. చేతివాటం చూపించాడు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!



మొబైల్ ఫోన్తో మెల్లగా అక్కడ నుంచి జారుకున్నాడు. దీంతో మొబైల్ కోసం టేబుల్ పై చూసిన ఆ మహిళా కానిస్టేబుల్ అవాక్కయింది. అక్కడ పెట్టిన మొబైల్ కనిపించకపోవడంతో కంగారు పడింది. పోలీస్ స్టేషన్లో తన సిబ్బందికి అడిగింది. ఎవరు దగ్గర లేకపోవడంతో.. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెతికింది. ఎక్కడా ఆ మొబైల్ కనిపించలేదు. సిబ్బంది అంతా కలిసి సిసి ఫుటెజ్ చెక్ చేయాలని నిర్ణయించారు. చెక్ చేసేసరికి.. సీసీ ఫుటేజ్ లో సెల్ఫోన్ ను మెల్లగా తస్కరించి జేబులో పెట్టుకుని జారుకున్న ఆ వ్యక్తి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడు వడ్లపూడి ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిని వెతికి పట్టుకొని మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికి సిమ్ కార్డును తీసి పడేసినట్టు గుర్తించారు. నిందితుడు పై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే చోరీ చేస్తాడా..? అది కూడా కానిస్టేబుల్ కు చెందిన సెల్ఫోన్..! వాడికి ఎంత ధైర్యం రా బాబు అంటూ అనుకున్నారు అదే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #dhuvvada #policestation #mobile #missing #case #todaynews #flashnews #latestupdate