మలేసియా ఎయిర్పోర్ట్‌లో గ్యాస్ లీక్! 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థత!

Header Banner

మలేసియా ఎయిర్పోర్ట్‌లో గ్యాస్ లీక్! 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థత!

  Fri Jul 05, 2024 18:50        Malaysia

మలేసియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడంతో 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11.23 గంటలకు గ్యాస్ లీక్ జరిగింది. ఈ సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకువచ్చారు.

 

ఇంకా చదవండి: జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఫైర్! చంద్రబాబు కక్షసాధించి ఉంటే పిన్నెల్లిని మాచర్లలో బట్టలూడదీసి నడిరోడ్డుపై!

 

ఈ ఘటనలో 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు, వీరిలో 14 మందిని చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు స్పష్టం చేశారు. విడుదలైన గ్యాస్ మిథైల్ మెర్కాప్టాన్ అని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని అధికారులు వెల్లడించారు. ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించినట్లు సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం పేర్కొంది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యం వేరుగా ఉందని తెలిపారు. ఈ గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

 

ఇంకా చదవండి: SCO సదస్సు 2024! ఉగ్రవాదంపై జైశంకర్ గట్టి హెచ్చరికలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఓరి దేవుడో... పాకిస్తాన్ లో పాల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ప్యారిస్ లో కన్నా కాస్ట్లీ!

 

నేడు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు చంద్ర‌బాబు! బేగంపేట నుంచి ఆయ‌న‌ నివాసం వ‌ర‌కు ర్యాలీ!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

ఢిల్లీలో నేడు కూడా ఏపీ సీఎం ఫుల్ బిజీ! కేంద్రమంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్న చంద్రబాబు!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! పేదలకు ఇళ్ల పంపిణీ పై టీడీపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #KualaLumpurAirport #GasLeak #Malaysia #PassengerSafety #AirportIncident #EmergencyResponse #SafetyFirst #TravelAlert #AirportNews #HealthAndSafety