మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

Header Banner

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

  Sat Jul 06, 2024 21:36        India, Others

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా పూణే నగరంలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ముగ్గురు గర్భిణిలకు ఈ వైరస్ సోకింది, దీంతో మొత్తం కేసుల సంఖ్య 09కి చేరుకుంది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శనివారం వెల్లడించింది. గతంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్లో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఏడెస్ దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ డెంగ్యూ, చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. 1947లో తొలిసారిగా ఉగాండాలో జికా వైరస్ని గుర్తించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ పిండం ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది.

 

ఇంకా చదవండి: కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!

 

పూణే మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ కల్పనా బలిలింత్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను తీవ్రతరం చేశామని చెప్పారు. అయితే, స్థానిక నివాసితుల నుంచి సహకారం లేకపోవడం తమకు ఇబ్బందిగా మారిందని, జికా వైరస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు నమూనాలను అందించడానికి వెనుకాడుతున్నారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో, మురికివాడల్లోని పిల్లలు ఫాగింగ్ బృందాలపై రాళ్లు విసిరినట్లు కూడా చెప్పారు.

ఇటీవల మహారాష్ట్రలో నమోదవుతున్న జికా వైరస్ కేసుల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. గర్భిణీ స్త్రీలకు జికా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్గా తేలితే పిండాల పెరుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, నియంత్రణ కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని కేంద్రం కోరింది.

 

ఇంకా చదవండి: అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

కొడాలికి బిగుస్తున్న ఉచ్చు! న‌మోదైన మ‌రో కేసు! తన తల్లి మరణానికి..

 

ఇకపై అలాంటివారికి పెన్షన్ లు లేనట్టే! షాక్ ఇచ్చిన చంద్రబాబు!

 

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

 

త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై! ముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం!

 

ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం! యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #ZikaVirus #Maharashtra #Pune #HealthAlert #AedesMosquito #VirusOutbreak #PregnancyRisk #PublicHealth #DiseaseControl #NIVIndia #HealthAwareness