శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం! భయాందోళనలో స్థానికులు!

Header Banner

శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం! భయాందోళనలో స్థానికులు!

  Thu Jul 18, 2024 13:41        India

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాత మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుత పులి చాలాసేపటి వరకు సుమారు అర్ధగంట సేపు డివైడర్ పై అటు ఇటు చూస్తూ ఉన్న దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. చాలాసేపు డివైడర్ పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్ళిపోయింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జనావాసం తిరుగుతున్న ప్రాంతంలో చిరుతపులి బయటకు రావడంతో పాత మెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత పులి సంచరించగా అప్పట్లో అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో తర్వాత చిరుత కనపడలేదు. కానీ మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు కూడా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులి నివాస ప్రాంతాలలోకి రాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అయితే అటవీశాఖ అధికారులు దేవస్థానం అధికారులు స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత! మాజీ ఎంపీ ఇంటిపై రాళ్ళదాడి!

 

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #India #Srisailam #Cheetah #Nandyala #Devotional #Temples #IndianTemples