కమ్మలు అంటేనే శ్రమకు, ప్రతిభకు నిదర్శనం! వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది! కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

కమ్మలు అంటేనే శ్రమకు, ప్రతిభకు నిదర్శనం! వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది! కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

  Sat Jul 20, 2024 14:32        India

ఎన్టీఆర్ అంటే ఓ బ్రాండ్ అని, మేమంతా ఆయన లైబ్రరీ నుండి వచ్చిన వారిమేనని, ఆయన తర్వాతనే కమ్మలకు ప్రాధాన్యత పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో శనివారం జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ కు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కమ్మలు అంటేనే శ్రమకు, ప్రతిభకు నిదర్శనం అని అన్నారు. కొండ పైన అమ్మోరు, కొండ కింద కమ్మలు అని ఓ నానుడి ఉందన్నారు. కమ్మలు ఎక్కడ ఉన్నారు అనేది ఈజీగా గుర్తించవచ్చని సీఎం అన్నారు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్లు ఉన్నచోట కమ్మలు ఉంటారని అన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కుని, దాన్ని ఇక్కడ గత ప్రభుత్వాలు కాలరాశారని అందుకే ఇక్కడ ప్రభుత్వ మార్పు జరిగిందని అన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, వెంకయ్య నాయుడు కమ్మలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుందని, కానీ తమ ప్రభుత్వం కమ్మల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం కేటాయించడమే కాదు, అద్భుతమైన భవనం కట్టుకునేలా కృషి చేస్తానని, అవసరమైన అనుమతులు, రెవెన్యూ పరంగా, మున్సిపల్ పరంగా అన్ని విధాలా సహకరిస్తామని సీఎం కమ్మ సంఘానికి హామీ ఇచ్చారు. అంతకుముందు పలువురు కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ కమ్మ కుల గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో పాటు పలువురు కమ్మ సంఘం నాయకులు, కమ్మలు పాల్గొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎంపీలతో జగన్ రెడ్డి కీలక సమావేశం! ఈ సారి ఏం స్కెచ్ వేస్తున్నాడో! 

 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు! నీటిమట్టం ఎంతంటే!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ! 105 కి చేరిన మృతుల సంఖ్య! స్వదేశానికి వచ్చిన భారత పౌరులు! 

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group 

Facebook group 


   #AndhraPravasi #India #KGF #KammaGlobalFederation #RevanthReddy #Telangana #Indians #Kammas #Hyderabad #World