కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

Header Banner

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

  Sat Jul 13, 2024 13:17        Kuwait

కువైట్ ఎడారిలో ఓ ప్రవాస భారతీయుడి ఆవేదనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత దేశంలోని యువకుడు కొందరు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు యువకులని తీసుకెళ్లిన ఏజెంట్లు మోసం చేసి అక్కడ వదిలేస్తారు. అలాంటి ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కువైట్ లో మంచి జీతంతో కూడిన పని కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తీసుకొచ్చి మోసం చేశాడని, తను చెప్పిన పని ఒకటి అయితే ఇక్కడ చేస్తున్న పని ఇంకొకటి అని, ఎడారిలో తీసుకొచ్చి పడేశారని ఓ తెలుగు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మట్లాడటానికి కూడా ఎవరు ఉండరని, సేద తీరడానికి చెట్టు కూడా లేదని, పశువులు, కుక్కలు, బాతులకు ఆహరం పెట్టడానికి.. వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని ఏంటో బాధపడుతున్నాడు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇక్కడ మోటార్లు, జనరేటర్లు పని చేయడం లేదని చెప్పినా ఓనర్లు పట్టించుకోవడం లేదని, రెండు కిలోమీటర్లు నడిచి చెట్లకు నీళ్లు పోయాలని. భోజనం, నీళ్లు సరిగ్గా ఉండట్లేదని వాపోతున్నాడు. ఏజెంట్ కి ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని, తన భార్య అంత డబ్బు తన దగ్గర లేదని చెబుతోందని, ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో ఎవరు స్పందించకపోతే.. తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని తన గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడి పరిస్థితులకు సంబందించి ఓ వీడియో తీసి, తనను ఎవరైనా కాపాడాలని చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ తెలుగు వ్యక్తి ఆవేదనను అర్థం చేసుకొని, అతన్ని కాపాడేందుకు ఎవరైనా చొరవ తీసుకుంటే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి  

నవయుగ ధర్మరాజు చంద్రబాబు! రాష్ట్ర ప్రగతి ఆయతోనే సాధ్యం! అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యలు! 

 

రెండేళ్లుగా ఉన్న సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన మంత్రి లోకేష్! ఇది కదా ప్రజాస్వామ్యం అంటే! 

 

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

 

రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు! 

 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants