మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ!

Header Banner

మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ!

  Sun Jul 14, 2024 19:42        Kuwait

గత 2 రోజులుగా వైరల్ అయిన కువైట్ లో తెలుగు తమ్ముడు పడుతున్న ఆవేదనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడం, మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై స్పందించి ట్వీట్ చేయడంతో పాటు, ఎంబసీ అధికారులతో మాట్లాడడం జరిగింది. తక్షణం అధికారులు స్పందించి, ఎడారిలో ఉన్న బాడితుడిని సంప్రదించి ఈ రోజు సురక్షితంగా ఎంబసీకి తీసుకురావడం జరిగింది. తిరిగి సురక్షితంగా ఇంటికి పంపేవారకు అతని బాధ్యత తీసుకుంటామని ఎంబసీ వారు అతనికి భరోసా ఇచ్చారు. ఎంబసీ కి వెళ్ళాక అతని ఆనందం ఎలా ఉందో అతని మాటల్లోనే తాజాగా రిలీజ్ చేసిన వీడియో ద్వారా చూడండి.

 

 

అతను ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా, మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామానికి చెందిన శివ. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో కష్టపడి కువైట్ లో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. రోజు ఏదో ఒక పని చేసుకుంటే తప్ప పూట గడవని కుటుంబం. తన భార్య కూడా రోజువారీ కూలీగా పనికి వెళ్తుంది. ఇతన్ని మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేసి కువైట్ లో దిక్కుతోచని స్థితిలో వదిలేసారు. లోకేష్ ఆ వీడియో చూసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు, ఎన్ఆర్ఐ టీడీపీ టీం అతని కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఎంబసీని సంప్రదించి అతడిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇక వివరాల్లోకి వెళ్తే కువైట్ ఎడారిలో ఓ ప్రవాస భారతీయుడి ఆవేదనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత దేశంలోని యువకులు కొందరు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు యువకులని తీసుకెళ్లిన ఏజెంట్లు మోసం చేసి అక్కడ వదిలేస్తారు.

 

అలాంటి సంఘటనే ఇది. కువైట్ లో మంచి జీతంతో కూడిన పని కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తీసుకొచ్చి మోసం చేశాడని, తను చెప్పిన పని ఒకటి అయితే ఇక్కడ చేస్తున్న పని ఇంకొకటి అని, ఎడారిలో తీసుకొచ్చి పడేశారని ఓ తెలుగు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ మట్లాడటానికి కూడా ఎవరు ఉండరని, సేద తీరడానికి చెట్టు కూడా లేదని, పశువులు, కుక్కలు, బాతులకు ఆహరం పెట్టడానికి.. వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని ఎంతో బాధపడ్డాడు.

 

ఇంకా చదవండి: రాయలసీమకు మరో శుభవార్త! రూ.4వేల కోట్ల పెట్టుబడితో విన్‌ఫాస్ట్ ఈవీ యూనిట్! ఇక ఉద్యోగులకు కొరత ఉండదు!

 

ఇక్కడ మోటార్లు, జనరేటర్లు పని చేయడం లేదని చెప్పినా ఓనర్లు పట్టించుకోవడం లేదని, రెండు కిలోమీటర్లు నడిచి చెట్లకు నీళ్లు పోయాలని. భోజనం, నీళ్లు సరిగ్గా ఉండట్లేదని వాపోయాడు. ఏజెంట్ కి ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని, తన భార్య అంత డబ్బు తన దగ్గర లేదని చెబుతోందని, ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో ఎవరు స్పందించకపోతే.. తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని తన గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడి పరిస్థితులకు సంబందించి ఓ వీడియో తీసి, తనను ఎవరైనా కాపాడాలని చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ తెలుగు వ్యక్తి ఆవేదనను అర్థం చేసుకొని, అతన్ని కాపాడేందుకు ఎవరైనా చొరవ తీసుకుంటే బాగుంటుంది అని కామెంట్లు పెట్టారు.

  

ఇవి కూడా చదవండి  

టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు! 

 

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు! 

 

మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ! 

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో! 

 

రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!

  

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants