విజయవాడ : గురునానక్ నగర్ లో విషాదం! ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం మృతి! హత్యా? ఆత్మహత్యా?

Header Banner

విజయవాడ : గురునానక్ నగర్ లో విషాదం! ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం మృతి! హత్యా? ఆత్మహత్యా?

  Tue Apr 30, 2024 15:02        Politics

విజయవాడ : గురునానక్ నగర్ లో విషాద సంఘటన జరిగింది.  ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం అనుమానాస్పదంగా మృత్యువాతపడ్డారు. కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబం మృతిపై పోలీసుల అనుమానం వ్యక్తం చేసారు. హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలు ఉన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీనివాస్ ప్రారంభించిన ఆస్పత్రి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయి. ఆర్థిక సమస్యలతో ఆస్పత్రిని నెల క్రితం లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. శ్రీనివాస్ బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

డాక్టర్ శ్రీనివాస్ ఏడాది క్రితం పూజ హాస్పటల్ ను నగరంలో ఏర్పాటు చేశారు. హాస్పటల్ నిర్వహణ కోసం ప్రతి నెల రూ.30లక్షల ఖర్చు అవుతోందని, దానికి తగ్గట్టుగా ఆదాయం లేదని తాను ఆత్మహత్య తప్ప మరో దారి లేదని స్నేహితులతో వాపోయాడు అని సమాచారం.

 

ఇవి కూడా చదవండి:   

ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం

 

మంగళగిరిలో కూరగాయల వ్యాపారులకు నారా బ్రాహ్మణి హామీ! మా బతుకులు రోడ్డుకీడ్చారు!

 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్

 

Evolve Venture Capital 

 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

 

ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

 

అరెరే పిల్లి ఎంత పని చేసింది! ఇంటిని త‌గ‌ల‌బెట్టిన పెంపుడు పిల్లి!

  

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Vijayawada #GurunanakColony #OrthopedicDoctor #AndhraPravasi #Pravasi #TeluguMigrants