త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ!

Header Banner

త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ!

  Wed Jun 19, 2024 11:13        Politics

- శాఖలు కేటాయించిన మ‌రుక్ష‌ణ‌మే కార్య‌క్షేత్రంలో దిగిన లోకేష్‌
- ఐటీ, విద్య శాఖ‌ల‌పై లోతైన స‌మీక్ష‌లు
- మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హ‌ణ‌

 

కూట‌మి ప్ర‌భుత్వంలో యువ‌మంత్రి నారా లోకేష్ త‌న‌దైన శైలి ప‌నితీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. గెలిచాం, రిలాక్స్ అవుదాం అనుకునే ర‌కం కాదు. గెలిచిన మ‌రుక్ష‌ణమే త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌ని క‌లిసేందుకు స‌మ‌యమంతా కేటాయించారు. 12వ తేదీన మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 14వ తేదీన నారా లోకేష్‌కి హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలు కేటాయించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మినిస్ట‌ర్ ఆన్ డ్యూటీగా లోకేష్ క్ష‌ణం తీరిక‌లేకుండా పాల‌న‌లో మునిగిపోయారు. త‌న మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్ ఉండ‌వ‌ల్లిలోని తన నివాసంలో “ప్రజాదర్బార్” నిర్వ‌హిస్తున్నారు. రోజూ వంద‌లాది మంది త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన‌తులు అందిస్తున్నారు. ప్ర‌త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, అంద‌రి స‌మ‌స్య‌లు ప్రాధాన్య‌తాక్ర‌మంలో ప‌రిష్క‌రించ‌నున్నారు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖల ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున కంపెనీల‌ను ర‌ప్పించేందుకు కొత్త ఐటీ పాల‌సీ తీసుకురావాల‌ని సూచించారు. విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మైన మంత్రి లోకేష్ విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన బ‌కాయిలన్నీ విడుద‌ల చేసి, విద్యార్థుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

 

ఇంకా చదవండిఏమీ లేదు గురూ.. టీడీపీ వాళ్లతో కాంప్రమైజ్ కోసం ట్రై! మరో కుట్రకు తెరలేపిన టీవీరజినీకాంత్!

 

ఓ వైపు ప్ర‌జాద‌ర్బార్‌, మ‌రోవైపు ఉన్న‌తాధికారుల‌తో త‌న శాఖ‌ల స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ బిజీగా ఉన్నా.. బ‌క్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం పెద్ద‌లు త‌న దృష్టికి తీసుకొచ్చిన స‌మ‌స్య‌లు పరిష్క‌రిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. గెలుపు అంటే ప్ర‌జాసేవ‌కు అవ‌కాశం, ప‌ద‌వి అంటే గురుత‌ర బాధ్య‌త అని భావించే హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ త‌న ప‌నితీరుతో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు.

 

ఇవి కూడా చదవండి 

కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో! 

 

పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు! 

 

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో! 

 

ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా! 

 

బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య! 

 

ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్! పూర్తి షెడ్యూల్ ఇదే! 

 

5 లక్షల విదేశీయులకు పౌరసత్వం ఇవ్వబోతున్న జో బైడెన్! కావలసిన అర్హతలు ఏంటో తెలుసా! 

 

దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్! 

 

బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?

 

షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు! 

 

శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు! 

                                                                                                           

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #NaraLokesh #PrajaDarbar #Mangalagiri #Undavalli