చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం! డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్! చివరికి ఏమైందంటే..?

Header Banner

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం! డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్! చివరికి ఏమైందంటే..?

  Tue Jul 02, 2024 12:07        Politics

చిత్తూరు జిల్లా: కుప్పంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. అయితే, చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో.. గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి.. ఈ స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు.

 

ఇంకా చదవండి: ప్రజా దర్బార్ లో లోకేశ్‍ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు! మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టడం!

 

అయితే, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాల‌ని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి. గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ అండ్‌ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా.. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆరా తీశారు. దాంతో ఈ లంచం బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. సర్వే శాఖ ఏడీ గౌస్‌ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించ‌డంతో లంచం తీసుకున్న మాట నిజమే అని తేలింది. తన భూమి సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్‌ చేసినట్టు గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. అది కూడా నిజమే అని అధికారులు తేల్చారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏడీని ఆదేశించారు. దాంతో డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువ‌డ్డాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #CMChandrababu #AndhraPradesh #DeputySurveyor #Bribery