జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఫైర్! చంద్రబాబు కక్షసాధించి ఉంటే పిన్నెల్లిని మాచర్లలో బట్టలూడదీసి నడిరోడ్డుపై!

Header Banner

జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఫైర్! చంద్రబాబు కక్షసాధించి ఉంటే పిన్నెల్లిని మాచర్లలో బట్టలూడదీసి నడిరోడ్డుపై!

  Fri Jul 05, 2024 15:00        Politics

ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మడకశిర ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎంఎస్ రాజు జగన్‌ తీరును ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఎంతోమంది దళితుల్ని చంపేస్తే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్ నేడు ఒక నరరూప రాక్షసుడి కోసం బయటకు వచ్చారని దుయ్యబట్టారు. బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం జగన్ వచ్చారంటేనే ఆయన ఎలాంటి వాడో అర్థమవుతోందని విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేకు ఇప్పటికైనా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం శుభపరిణామమని ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు.

 

ఇంకా చదవండి: ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన జగన్‌కు పిన్నెల్లి లాంటి కరుడుగట్టిన క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీలేదన్నారు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడిరోడ్డుపై గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. 20 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 14 కేసులున్న నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేదల్ని పీల్చి పిప్పిచేసిన పిన్నెల్లి లాంటి క్రిమినల్ సౌమ్యుడు, మంచివాడిగా కనిపించాడని ఎద్దేవా చేశారు. 30 కేసులున్న జగన్‌కు 14 కేసులున్న పిన్నెల్లి సౌమ్యుడిగా కనిపించడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు నిజంగా కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే పిన్నెల్లిని మాచర్ల నియోజకవర్గంలో బట్టలూడదీసి కొట్టి నడిరోడ్డుపై పోలీసులు నడిపించి ఉండేవారని రాజు పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కువైట్‌: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

 

వాట్సాప్‌ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్‌! కొత్త సైబర్ భద్రతా చర్యలు!

 

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!

 

మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!

 

న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ ప్రైడ్‌ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్‌ బ్యాంకర్‌ దాడి! పదవికి రాజీనామా!

 

క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MSRaju #Madakasira #Telugudesam #YSJagan