రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

Header Banner

రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

  Tue Jul 09, 2024 16:00        Politics

రోజా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సమయం నుంచి చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకొని తరచూ విమర్శలు గుప్పించేవారు. జగన్ హాయంలో మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో పదవి దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో నగరి లో రోజా ఓడిపోయారు. పార్టీ అధికారం కోల్పోయింది. టూరిజం మంత్రిగా వ్యవహరించిన రోజా వివాదాస్పంగా మారిన రుషికొండ భవనాల గురంచి గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత రుషికొండ అంశం మినహా ఇతర రాజకీయ అంశాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రోజా వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆ ఫైర్ లేదు. మాటల తీరు మారింది. సొంత పార్టీ నేతలే రోజా మాట తీరులో వచ్చిన మార్పు పైన చర్చించుకుకోవటం ఆసక్తి కరంగా మారింది.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీగా ఏకగ్రీవం! సర్టిఫికెట్ అందుకున్న జనసేన నేత! నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి!

 

రోజా.. వైఎస్ఆర్ పాలనను మెచ్చుకున్నారు, అలాంటి పాలనే జగన్ అందించారని చెప్పారు, అదే పాలన మళ్లీ కావాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయామని..ఓడిపోవటం బాధాకరమైనా..ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని సూచించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. ఎల్లప్పుడూ వైసీపీ ప్రజాపక్షంలో ఉంటుందన్నారు. రాజన్న పాలన మళ్లీ రావాలని, రాజన్న బిడ్డ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు దూరమయ్యేలా అందరం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు రోజా. విమర్శనాస్త్రాల ప్రయోగాన్ని పక్కనపెట్టి.. వైసీపీ కార్యాచరణపైనే ఎక్కువగా మాట్లాడారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి విషయంలోనూ రోజాలో మార్పు కనిపిస్తోంది. ఇదే విధంగా మంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యవహరించి ఉంటే బాగుండదనే వ్యాఖ్యలు వైసీపీ కేడర్ లో మొదలయ్యాయి.

మరోవైపు సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. చాల్లే అమ్మ చెప్పింది నీ కాకమ్మ కబుర్లు ఎవరు వినరులే.. అని ఒకరు కామెంట్ చేస్తే. మరొకరు నీ కలలు కలలు గానే మిగిలిపోతాయిలే దిగులు పడమాక అని కామెంట్ చేశారు. ఈ దరిద్రాన్ని ఎప్పుడు జైల్లో వేస్తారు రా బాబు అని ఇంకొకళ్ళు కామెంట్లు పెడుతూ రోజాని ఒక ఆట ఆడుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #ROja #YCP #Comments