విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు!

Header Banner

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు!

  Wed Jul 10, 2024 12:00        Politics

ముక్కుసూటిగా వ్యవహరించే నిజాయితీపరుడైన రూల్ బుక్ అధికారిగా పేరొందిన విశాఖ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి పర్యటనలు, తనిఖీలతో పోలీసు శాఖను పరుగులు పెట్టించేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు నేరాలను స్వయంగా గుర్తించి చర్యలు తీసుకోవడంతో క్రింది స్థాయి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అర్ధరాత్రి రెండు గంటల పాటుగా నగరంలో నెలకొన్న వాస్తవికత పరిస్థితులను పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలనేందుకు పోలీసు బాస్ చేపట్టిన ఈ పర్యటనతో పలు నేరాలు బయటపడ్డాయి. రహదారులపై బహిరంగ మద్యపానం చేస్తున్న వారిని పట్టుకొని అక్కడికక్కడే కేసు నమోదు చేయించారు. వైసీపీ ప్రభుత్వం బార్ లలో మద్యం ధరలను విపరీతంగా పెంచినప్పటి నుంచి విశాఖ లో బహిరంగ మద్యపానం ఎక్కువైంది. కార్లు, ఆటోల్లో ప్రధాన రహదారుల పక్కనే సేవిస్తున్నారు. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ఒకరిని పట్టుకొని కేసు నమోదు చేయించారు.

 

ఇంకా చదవండి:  రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

వ్యభిచారం కోసం ఉన్న బాధిత ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓవర్ లోడ్ తో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల ఆటోను పట్టుకొని కేసు నమోదు చేయించారు. సీపీ ఇచ్చిన సమాచారంతో నెంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న కొన్ని ద్విచక్ర వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేశారు. నగరంలో ఒక చోట ప్రజలు దొంగను పట్టుకొని నిర్బంధించినట్లు ప్రజలకు ఫిర్యాదుల కోసం ఇచ్చిన నంబరు 7995095799 కు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు డీసీపీ (క్రైమ్స్) తో మాట్లాడి అక్కడకు పోలీసులను తక్షణం పంపి దొంగను అరెస్టు చేయించారు. సందర్శనలో చివరగా మహారాణి పేట పోలీసు స్టేషన్ కు వెళ్లిన సిపి అక్కడ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును స్వయంగా పరిశీలించి, స్టేషన్ జనరల్ డైరీలో తన విజిటింగ్ అవర్స్ ను రాసి వచ్చారు. అర్ధరాత్రి పోలీసు కమీషనర్ నేరుగా పోలీసు స్టేషన్ కు రావడంతో పోలీసు సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

 

ఇంకా చదవండి: భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి! ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని..రామ్మోహన్

 

విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో గల ప్రజలు అందరూ 7995095799 నంబరును సద్వినియోగం చేసుకోవాలని శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఎటువంటి సమాచారం కలిగి ఉన్నా, ఎవరైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నా, లంచం అడిగినా లేదా తీసుకున్నా అటువంటి సమస్యలు ఉన్నా పై నంబరు ద్వారా స్వయంగా తెలియజేయవచ్చిన స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచుతామని హామీ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

 

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చ‌ర్య‌ల‌కు ఆదేశం!

   

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #TDP #AP #APGovernment #Amaravathi #Commissioner #Police #APPolice #Visakhapatnam #Vizag