సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్ సిరియాక్! ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై!

Header Banner

సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్ సిరియాక్! ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై!

  Wed Jul 10, 2024 17:00        Politics

ప్రముఖ నటి సమంత ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదం కావడం తెలిసిందే. సంప్రదాయేతర వైద్య విధానాలు కూడా మెరుగైన ఫలితాలను ఇస్తాయంటూ ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి వివరించారు. అయితే, ఆన్ లైన్ లో 'ది లివర్ డాక్టర్' గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్... సమంత పోస్టును తప్పుబట్టారు. సమంత ఏమన్నా వైద్య శాస్త్రం చదివిందా? ఫలానా మందులు వాడాలని ఆమె ఎలా సూచిస్తారు? రోగుల ప్రాణాల మీదికి వస్తే ఎవరిది బాధ్యత? ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలి అంటూ ఆ వైద్యుడు నిప్పులు చెరిగారు. ఆ వైద్యుడి వ్యాఖ్యలకు సమంత కూడా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. సమంతకు క్షమాపణ చెప్పారు. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో వైద్యులుగా చెప్పుకునే వారు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుంటారని, చాలాకాలంగా తాను అలాంటి వారిపై పోరాడుతున్నానని వివరించారు.

 

ఇంకా చదవండి: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫిర్యాదు! సోషల్ మీడియాలో కించపరిచేలా!

 

ఇక, సమంత తన పోస్టులో ఇద్దరు డాక్టర్ల (డాక్టర్ మిత్రా బసు చిల్లర్, డాక్టర్ జోకర్స్) ను ఉదహరించారని, వారి ద్వారా తెలుసుకున్న విషయాలనే తాను పోస్టులో పేర్కొన్నట్టు సమంత చెబుతున్నారని డాక్టర్ సిరియాక్ వివరించారు. దాంతో కొందరు నెట్టిజన్లు... ఆ ఇద్దరు డాక్టర్ల సంగతేంటో చూడండి అని తనను కోరారని  డాక్టర్ సిరియాక్ వెల్లడించారు. కానీ, సమంత ఆ 'డాక్టర్లు' చెప్పిన విషయాలను నిర్ధారణ చేసుకోకుండానే పోస్టు చేయడంతో తాను స్పందించానని వివరణ ఇచ్చారు. సమంత ఆరోగ్య పరిస్థితి పట్ల తాను సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యవంతురాలవ్వాలని కోరుకుంటున్నానని డాక్టర్ సిరియాక్ తన పోస్టులో పేర్కొన్నారు. "నా అభిప్రాయాలను ఆమె మరోలా అర్థం చేసుకుని ఉంటే క్షమించమని కోరుతున్నాను. బాధాకరమైన ఆమె అనారోగ్య పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకుంటూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న డాక్టర్లను వదిలించుకోమని చెప్పడమే నా ఉద్దేశం" అని డాక్టర్  సిరియాక్ స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Samantha #TheLiverDoc #Nebulization #Online #SocialMedia