వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

Header Banner

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

  Thu Jul 11, 2024 19:43        Politics

సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ ను 'మెటా' బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సాప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేశ్ ప్రకటించారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సాప్‌కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు.

 

ఇంకా చదవండి: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల! రూ. 250 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల!

 

వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేశ్ కి వాట్సాప్ చెయ్యడం వల్ల టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి సమస్యలను పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేశ్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్ లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

 

ఇంకా చదవండి: ఎవరికైనా కష్టమే.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు! ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

 

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NaraLokesh #Telugudesam #MailID #Whatsapp