పల్నాడు కి రానున్న రైల్వే ప్రాజెక్టులు! ఆ రైల్వేస్టేషన్లలో సరికొత్త మార్పులు! ఈ దెబ్బతో ఈ ప్రాంతాలు దిశ మారి ఎక్కడికో వెళ్ళనున్న అభివృద్ది

Header Banner

పల్నాడు కి రానున్న రైల్వే ప్రాజెక్టులు! ఆ రైల్వేస్టేషన్లలో సరికొత్త మార్పులు! ఈ దెబ్బతో ఈ ప్రాంతాలు దిశ మారి ఎక్కడికో వెళ్ళనున్న అభివృద్ది

  Fri Jul 12, 2024 07:58        Politics

రైల్వే సమస్యలు పరిష్కారం కోరుతూ ఈరోజు హైదరాబాదులోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను టిడిపి పార్లమెంటరీ నేత,  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జిఎంకు ఎంపీ అందజేశారు. పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు  పిడుగురాళ్ల స్టేషన్లో   స్టాపేజ్  ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగుళూరు వరకు.. నరసరావుపేట,  వినుకొండలో స్టాప్‌లతో కొత్త వందేభారత్ రైలుని ప్రారంభించాలని కోరారు.

 

ఇంకా చదవండి: వైసీపీ మోసం చేసిందంటూ కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే! ప్రాణాలకు తెగించి పార్టీ కోసం! జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే!

 

పెదకూరపాడు స్టేషన్ లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు స్టాపేజ్‌ని ఇవ్వాలని,  సత్తెనపల్లి స్టేషన్‌లో  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కు స్టాపేజీ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసారు. పేరుచెర్ల నుండి గన్నవరం లేదా పెదవుటపల్లికి కొత్త ఎమ్ఎమ్ టిఎస్ రైలు సేవలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం ఉన్న  బోగీలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త బోగీలకు మార్చాలని కోరారు. కొత్త జిల్లా పల్నాడులో  ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల,  నడికుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునికీకరణ చేపట్టాలని కోరారు. రైల్వే లైన్ పనులని పూర్తి చెయాలనీ కోరారు.

ఇంకా చదవండి: భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

 

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Railways #LavuForPalnadu #MpLavuSrikrishnadevarayalu