జిల్లాలో జలాశయాల పరిశీలన! మంత్రుల ప్రత్యేక చర్యలు ప్రారంభం!

Header Banner

జిల్లాలో జలాశయాల పరిశీలన! మంత్రుల ప్రత్యేక చర్యలు ప్రారంభం!

  Sun Jul 14, 2024 14:33        Politics

మంత్రి నిమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు

నెల్లూరు జిల్లాలో జలాశయాలను పరిశీలనకు తొలిసారిగా వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల

మంత్రి నిమ్మల రామానాయుడుకి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

నెల్లూరు: జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు తొలిసారిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడిది చేసిన మంత్రిని నెల్లూరు జిల్లా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి సాలవాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వారి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ,జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజిజ్ తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


జిల్లాలో మంత్రుల పర్యటన వివరాలు ఇలా

మరి కాసేపట్లో సోమశిల జలాశయాన్ని రాష్ట్రమంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి,ఎంపీ వేమిరెడ్డి పరిశీలిస్తారు. సోమశిల జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సోమశిల ఆఫ్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులను అధికారులతో అడిగి తెలుసుకొనున్నారు. వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు.

 

ఇవి కూడా చదవండి 


ట్రంప్ పై కాల్పులకు ఉపయోగించిన వెపన్ ఇదే! వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
 

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం! 

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ! 

    

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #NELLORE #hottopic #liveupdates #MINISTERS #water #flashnews #Districts #nelloreupdates