హిందూపురం పర్యటనలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు! తేనె తుట్టను కదిలించారా!

Header Banner

హిందూపురం పర్యటనలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు! తేనె తుట్టను కదిలించారా!

  Mon Jul 15, 2024 08:30        Politics

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా మరో తేనె తుట్టను కదిపారు బాలయ్య. జిల్లా కేంద్రాల మార్పు మీద బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ కొటిపి వద్ద అర్ధాంతంగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ.. ఆరు నెలల్లోగా ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారుల చేతికి తాళాలు అందిస్తామన్నారు. నూతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయన్న బాలయ్య.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావటంతో వాటిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పిన బాలకృష్ణ.. వైసీపీ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ముఖ్యమంత్రి సహకారంతో హిందూపురాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇదే సమయంలో జిల్లా కేంద్రం మార్పు గురించి కొంతమంది ప్రశ్నించగా.. బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఇంకా చదవండి: మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ!

 

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్చాలనే డిమాండ్ ఉందన్న బాలకృష్ణ.. హిందూపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు ఉన్నాయన్నారు. దీనిపైనా ప్రభుత్వం ఆలోచిస్తుందని.. జిల్లా పేర్లు అవే ఉంచినా, జిల్లా కేంద్రాల మార్పుపై ఆలోచన చేస్తామని అన్నారు. అయితే దీని గురించి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి ఉంది. అయితే పుట్టపర్తికి, హిందూపురం పట్టణానికి మధ్య దూరం ఉండటంతో పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బంది అని హిందూపురం వాసుల వాదన. అలాగే జిల్లాలో పెద్ద పట్టణమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. జిల్లాల ఏర్పాటు సమయంలోనూ హిందూపురం జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే ఆధ్యాత్మిక నగరం పుట్టపర్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి అప్పటి వైసీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాకు మధ్యలో ఉంటుందని పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసింది. అయితే జిల్లా కేంద్రాల మార్పు అంశాన్ని బాలయ్య ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాల ఏర్పాటు సమయంలో అనేక డిమాండ్లు రాగా.. ఇప్పటికి అంతా సద్దుమణిగింది. అయితే ఒక్కచోట జిల్లా కేంద్రాన్ని మారిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర చోట్ల కూడా ఇలాంటి తరహా డిమాండ్లు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలనంగా మారిన ట్రంప్‌పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. లైవ్ లో రికార్డ్ అయిన సంఘటన! వెంటనే ఆదేశాలు జారీ చేసిన వైట్ హౌస్!

 

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

 

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

 

చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #ANdhraPradesh #APpolitics #balakrishna