వైసీపీ ఎంతటికైనా తెగిస్తుంది! పేటీఎం చానళ్లు, భజన బ్యాచ్ ఉంది జాగ్రత్త, మంత్రి ఫైర్!

Header Banner

వైసీపీ ఎంతటికైనా తెగిస్తుంది! పేటీఎం చానళ్లు, భజన బ్యాచ్ ఉంది జాగ్రత్త, మంత్రి ఫైర్!

  Tue Sep 03, 2024 07:00        Politics

విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, వరద బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై మిషం కక్కుతున్న వైసీపీకి మొదటి నుంచి అలవాటే అని, రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని, విజయవాడ, అమరావతి ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి రామానాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. 1998లో, 2009 కంటే ఎక్కువగా ఇప్పుడు విజయవాడలో వరద నీరు వచ్చిందని, గతంలో కృష్ణా నదిలో ఇంత వరద నీటిని తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతం అంటూ వైయస్ జగన్ గతంలో ప్రయారం చేశారని, జగన్ కలను ఆ పార్టీ నాయకులు చాలామంది నిజయం చెయ్యడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

 

ఇంకా చదవండి: మళ్లీ కుట్ర? బ్యారేజీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నమా? గేట్ 69 వద్ద బోటుల ప్రమాదం వెనుక ఏముందీ?

 

కొన్ని పేటీఎం చానళ్లు, పేటీఎం బృందాలు అమరావతిపై, కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు పోటెత్తినా అమరావతి చెక్కుచెదర లేదని, అమరావతిని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని, విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల ప్రజలకు త్వరలోనే న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కృష్ణా కరకట్ట పై మంతెన ఆశ్రమం వద్ద ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రి నిర్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్ కు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదని, ఐదేళ్లుగా బుడమేరు లో ఎక్స్ టెన్షన్ పనులు అస్సలు జరగలేదని, గేట్ల మరమ్మతులు చెయ్యడానికి కన్నయ్య నాయుడు వస్తున్నారని, ఈరోజు రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తారని, బుడమేరుకు పడిన మూడు గంటలకు ఈ రాత్రికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ కు మూడు బోట్లు కొట్టుకు రావడం వెనక వైసీపీ నాయకుల కుట్ర ఉండవచ్చని, ఆ పార్టీ నాయకులు ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధమవుతారని మంత్రి నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు.

ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance