ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

Header Banner

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

  Wed Sep 11, 2024 07:00        Politics

మహిళలు వంట గదికే పరిమితం అనేది గతం. ఇప్పుడు ఆ వంట గదిని కూడా వ్యాపారంగా మార్చుతూ.. అద్భుతాలు సృష్టిస్తున్నారు మహిళలు. వారికి కావాల్సిందల్లా కాస్తంత ఆర్థిక సాయం. అది ఉంటే.. వారు ఏదైనా సాధించి చూపిస్తున్నారు. అందుకే మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా దూసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కలిసి.. తెచ్చిన పథకాలను, గ్రామాల్లోని స్వయం సహాయ బృందాల (SHG) మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఆ పథకాలేవో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ స్కీం (PMEGP), ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి కార్యక్రమం (PMFME) పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీలో అమలయ్యేలా చేస్తోంది. ఈ పథకాల ప్రత్యేకత ఏంటంటే.. మహిళలు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే.. ఏపీ ప్రభుత్వం వారికి అయ్యే ఖర్చులో 35 శాతం రాయితీ ఇస్తుంది. దాని వల్ల మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మహిళలు ఇంటి దగ్గరే చెయ్యదగ్గ వ్యాపారాలు చాలా ఉంటాయి. కిరాణా షాపు పెట్టొచ్చు, కుట్టు మిషన్ నిర్వహించవచ్చు, పిండి మిల్లు నడపొచ్చు, ధాన్యం మిల్లు, చిరు వ్యాపారాల వంటివి ఏవైనా చెయ్యవచ్చు. కొన్ని జిల్లాల్లో.. రుబ్బిన ఇడ్లీ, దోసె పిండిని అమ్మే వ్యాపారాలు కూడా వచ్చేశాయి. ఇలాంటి వ్యాపారాలకు ముందుగా కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

 

ఇంకా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్! టీడీపీ గూటికి మాజీ మంత్రి!

 

ఆ పెట్టుబడిలో 35 శాతం రాయితీ సొమ్ముగా ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. అందువల్ల వ్యాపారం ప్రారంభించడం తేలికవుతోంది. కేంద్ర పథకాలను ఏపీలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి మరీ పథకాలను అమలు చేయిస్తోంది. ఉదాహరణకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ స్కీం కింద ఈ సంవత్సరం ప్రతీ జిల్లాలో 600 యూనిట్లు ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి కార్యక్రమం ప్రతీ జిల్లాలో 400 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఉంది. అందువల్ల కలెక్టర్లు.. ఈ పథకాలను ఎవరు పొందుతారా అని ఎదురుచూస్తున్నారు. ఈ రెండు పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న మహిళలు.. ఇవి తమకు బాగా ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. తాము ఇంటి నుంచే వ్యాపారం చేయగలుగుతున్నామని అంటున్నారు. కొంతమంది బ్యాంకుల్లో రుణం తీసుకొని వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో.. త్వరగా ప్రారంభించి, వచ్చే ఆదాయంలో కొంత కొంత బ్యాంక్ రుణం తీర్చేస్తున్నారు. PMEGP కింద అప్లై చేసుకోవాలి అనుకునేవారు.. అధికారిక వెబ్‌సైట్ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp లోకి వెళ్లొచ్చు. అలాగే.. PMFME కింద అప్లై చేసుకోవాలి అనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ https://www.pmfmeap.org లో అప్లై చేసుకోవచ్చు. లేదా తహశీల్దారు ఆఫీసుకి వెళ్లి ఎంక్వైరీ చెయ్యవచ్చు. ఆల్రెడీ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి.. పిలిచి మరీ వ్యాపారం ఎలా ప్రారంభించాలో పూర్తి వివరాలు చెబుతారు. ఏపీ ప్రభుత్వం కూడా యువత ఈ దిశగా ముందుకు రావాలని కోరుతోంది.

 

ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu