జగన్ కు మరో ఎంపీ షాక్ - బీజేపీ ఆట మొదలు..! కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దల రెడీ!

Header Banner

జగన్ కు మరో ఎంపీ షాక్ - బీజేపీ ఆట మొదలు..! కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దల రెడీ!

  Mon Sep 23, 2024 11:17        Politics

వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు తాజాగా మరో ఎంపీ పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీల పైన బీజేపీ నేతలు గురి పెట్టారు. తాజా మంత్రాంగంలో భాగంగా మరో ఎంపీ కాషాయం గూటికి చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటింగ్ పైన బీజేపీ ఫోకస్ చేసింది. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. ఎనిమిది అసెంబ్లీ ఆ తరువాత ఎనిమిది లోక్ సభ సీట్లను గెలుచుకుంది. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని డిసైడ్ అయింది.

 

ఇంకా చదవండి: జత్వానీ కేసులో కీలక మలుపు! డెహ్రాడూన్ నుంచి విజయవాడకు విద్యాసాదర్ తరలింపు!

 

వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉండగా ఇద్దరు రాజీనామా చేసారు. ఇప్పుడు కృష్ణయ్య తో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని సూచించనట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం.. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణయ్య గతంలో అరెస్సెస్ లో క్రియాశీలకంగా పని చేసారు. ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గడచిన రెండేళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే కృష్ణయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని కృష్ణయ్య ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తిరిగి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పైన కృష్ణయ్య ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #R.Krishnaiah #YSRCP #BJP #Telangana