ఈరోజు కడపకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం! తీవ్ర ఆగ్రహం వ్యక్తం.. ఎందుకంటే?

Header Banner

ఈరోజు కడపకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం! తీవ్ర ఆగ్రహం వ్యక్తం.. ఎందుకంటే?

  Sat Dec 28, 2024 08:24        Politics

అన్నమయ్య జిల్లాలో ఓ వైసీపీ నేత దాష్టీకానికి గురైన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు (శనివారం) కడప వెళ్లి రిమ్స్ లో జవహర్ బాబును పరామర్శించనున్నారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి నిన్న మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వాలని ఎంపీడీవో జవహర్ బాబును అడిగాడు. ఎంపీపీ వస్తేనే తాళాలు ఇస్తామని జవహర్ బాబు చెప్పడంతో, ఆగ్రహావేశాలకు గురైన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.

 

ఇంకా చదవండి: ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

తీవ్ర గాయాలపాలైన జవహర్ బాబును పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా బలమైన సంకేతాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆ ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP