మందుబాబులకు అలర్ట్.. డిసెంబర్ 31న వైన్ షాపులు ఎప్పటి దాకా తెరిచి ఉంటాయంటే!

Header Banner

మందుబాబులకు అలర్ట్.. డిసెంబర్ 31న వైన్ షాపులు ఎప్పటి దాకా తెరిచి ఉంటాయంటే!

  Sat Dec 28, 2024 12:59        Politics

డిసెంబర్ 31 వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్న మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆ రోజు అర్ధరాత్రి దాకా వైన్ షాపులు తెరుచుకోవచ్చని అనుమతిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు, పలు ఈవెంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతినిచ్చింది. పార్టీలు, పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, వైన్ షాపులు అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Hyderabad #Trafficpolice #duringdrunk