ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

Header Banner

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

  Sat Jan 04, 2025 12:38        Politics

కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల కోసం 10 క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేతలను ప్రోత్సహించే దిశగా ఈ మేరకు క్లస్టర్లను మంజూరు చేశారు. అలాగే కేంద్రం నిధుల్ని కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని పదిచోట్ల ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో చేనేతలకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. వారిని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. 

 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. కొత్తగా రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ.. కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచందుకు కేంద్రం క్లస్టర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం ఒక్కొక్కటి.. తిరుపతి జిల్లాలో మాత్రం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

 

అంతేకాదు పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి తొలి అడుగు కూడా పడింది. ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా రూ.5కోట్లు విడుదలయ్యాయి. మిగిలినవాటికి మరో రూ.2కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 10 రోజుల్లో రాష్ట్రానికి జమకానున్నాయి.. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో 2వేలమంది చేనేతలకు లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం చేనేత, అనుబంధ రంగాలకు చెందిన 3.50 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 క్లస్టర్లు ఉంటే.. చేనేత కార్మికుల్ని 100 నుంచి 500 మంది ప్రాతిపదికగా క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్‌‌లో కార్మికుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి ఒక్కో క్లస్టర్‌కు రూ.2కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. కేంద్రం విడుదల చేసే ఈ నిధులతో క్లస్టర్‌ పరిధిలోని కార్మికులకు 90% రాయితీతో చేనేతలకు అవసరమైన ఆధునిక యంత్రాలు రూ.15-70 వేల విలువైనవి అందజేస్తారు. అయితే లబ్ధిదారులు 10శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు 100% రాయితీతో వ్యక్తిగత వర్క్‌షెడ్డును కూడా నిర్మిస్తారు. 

 

మరోవైపు చేనేత కార్మికులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు డిజైనర్‌ కూడా క్లస్టర్‌టలో అందుబాటులో ఉంటారు. అలాగే కేంద్రం అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్‌ డెవలప్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమిస్తుంది. రాష్ట్రంలో ధర్మవరం చేనేత రంగంలో కీలకమైన ప్రాంతం అని చెప్పాలి. అక్కడ చేనేతలు కంచిపట్టు చీరల్ని తయారు చేస్తారు.. ఇవి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు. ఈ మేరకు ధర్మవరం చేనేతల్ని ప్రోత్సహించేందుకు రూ.34 కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఈ మేరకు డీపీఆర్‌ను కూడా రూపొందిస్తున్నారు. అలాగే పిఠాపురం, అంగరలో కూడా రూ.14 కోట్లతో మెగా క్లస్టర్ల ఏర్పాటు కోసం సర్వే చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం 90శాతం నిధులు మంజూర చేయనుంది.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 10శాతం భరించనుంది. కేంద్రానికి డీపీఆర్‌లు పంపించిన తర్వాత నిధులు విడుదల చేస్తారు. మొత్తానికి ఈ క్లస్టర్లతో ఆయా జిల్లాలకు మహర్దశ అని చెప్పాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP