కన్న తల్లికి దణ్ణం పెట్టనోడు తల్లికి వందనం అడిగితే! ఎందుకు ఆతృత? మంత్రి ఫైర్!

Header Banner

కన్న తల్లికి దణ్ణం పెట్టనోడు తల్లికి వందనం అడిగితే! ఎందుకు ఆతృత? మంత్రి ఫైర్!

  Sun Jan 05, 2025 10:36        Politics

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పెన్షన్లు మినహా ఇతర పథకాల అమలుకు ప్రభుత్వం సిద్దం కాకపోవడం, తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను వదిలేయడంపై జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే జగన్ ట్వీట్ కు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తల్లికి వందనం పథకంపై జగన్ చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో 9 వేల మంది నిర్వాసితులకు ఆర్ధిక ఇబ్బందుల్ని లెక్కచేయకుండా వెయ్యి కోట్లు ఇచ్చామని పయ్యావుల జగన్ కు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాధాన్య అంశాలున్నా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చినట్లు తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు నెలల్లో పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన దాంట్లో ఐదు శాతమైనా జగన్ తన ఐదేళ్ల పాలనలో చేశారా అని పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని, పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని, మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పయ్యావుల జగన్ కు తెలిపారు. అయినా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే ఆతృత జగన్‌కు అనవసరమని పయ్యావుల తెలిపారు. రాష్ట్రంలో అనర్హులు పేరిట పెన్షన్లను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వైసీపీ నేతలు సృష్టించిందే అని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews