రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

Header Banner

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

  Tue Dec 24, 2024 11:20        Business

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది రెండు సిమ్‌లను వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో అవసరం లేకపోయినా రెండో సిమ్ కార్డుకు నెట్ సదుపాయంతో కూడిన రీచార్జి ఓచర్ ప్లాన్‌కు తప్పనిసరిగా అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల పరిస్థితి అదే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నెలవారీ ఖర్చు తగ్గించుకునే విధంగా ప్రత్యేక రీఛార్జి ప్లాన్‌లు రాబోతున్నాయి. ఈ మేరకు వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా టెలికం కంపెనీలకు టెలికాం నియంత్రణ (ట్రాయ్) కీలక ఆదేశాలు ఇచ్చింది. అది ఏమిటంటే.. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్‌లు తీసుకురావాలని అయా కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలని జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీంతో వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుందని తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఇది ఉంటుందని ట్రాయ్ వెల్లడించింది.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

దాదాపు అన్ని టెలికాం కంపెనీలు ప్రస్తుతం వాయిస్, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా (నెట్) కలగలిపిన ప్లాన్‌లు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు నెలకు దాదాపు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో డేటాతో కూడిన వోచర్‌ను రీచార్జి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు స్మార్ట్ ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు వాడే వారు కూడా అవసరం లేకపోయినా రెండో సిమ్‌కు డేటాతో కూడిన రీచార్జి చేస్తూ నెంబర్ వాడుకలో ఉండేందుకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. అయితే ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలతో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలుగనుండటంతో వారికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అంతే కాకుండా స్పెషల్ టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల ప్రస్తుత కాలపరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు ట్రాయ్ పెంచింది. దీంతో పదే పదే రీఛార్జి చేసుకునే ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే తక్కువ కాలవ్యవధి కల్గిన ప్యాక్‌లను సైతం అందించాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ సూచించింది. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #TRAI #2SimCards #telecomcompanies #rechargeplans #voicecalls