AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
Thu Jun 13, 2024 22:32 Education, Politicsతేదిః 13.6.2024, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలు చేయడంతో అభ్యర్ధులు ముఖ్యమం్రతి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఙతలు. గత పాలకులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేస్తే మెగా డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాడు తెలుగుదేశం రాష్ట్ర అర్గజైజింగ్ సెక్రటరీ నాదేండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ముందు డీఎస్సీ అభ్యర్ధులు పెద్ద ఎత్తున్న నినాదాలతో చంద్రబాబు నాయుడుకు కృతజ్ఙతలు తెలిపారు. గత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖను ఉన్నతంగా నడపాల్సింది పోయి. పశువుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. వేల టీచర్ పోస్టులు ఖాళాగా ఉన్నా.. భర్తీ చేయకుండా ఉన్న టీచర్లను బానిసలుగా చూశారు. ప్రభుత్వ టీచర్లను బార్‌షాపుల వద్ద నిలబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం నిరుద్యోగుల 5 సంవత్సరాల ఆకాంక్ష అయిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది డీఎస్సీ అభ్యర్ధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాటను ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేయడం అంటేనే రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగు పడ్డాయి.
ఇంకా చదవండి: మంత్రిగా అవకాశం కల్పించిన పవన్ కి! తెనాలి ప్రజలకు, ఎప్పుడూ రుణపడి ఉంటా!
నియంత పాలనకు ప్రజలు చమరగీతం పాడారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడారు. మాట తప్పను మడమ తిప్పను అంటూనే 5 కోట్ల మంది ప్రజల అంక్షలను నిండా ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలో ముంచారు. నేడు చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అ్రగబాఘన ముందుకు నడపడంలో పాటు 100 శాతం అక్షరాస్యతను పెంచడానికి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుదని తెలుగుదేశం రాష్ట్ర అర్గజైజింగ్ సెక్రటరీ నాదేండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2023 జులై 31న లోక్‌సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానం ఇచ్చారు. 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు, 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
ఇంకా చదవండి: జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ* మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు డీఎస్సీ లేక చాలా అవస్థలు పడ్డారని అదిగో, డీఎస్సీ అని ఊరించి విద్యార్థులను కోచింగ్ సెంటర్లు వేలాది రూపాయలు ఖర్చు పెట్టించారని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తే నిరుద్యోగుల తర్వాత తరపున నేను ఉన్నానని యువ గళంలో భరోసా ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబునాయుడు గారు డీఎస్సీ మీద చేయడం జరిగిందని డీఎస్సీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని నిరుద్యోగులను ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన అన్నారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనక్కి నట్టడం జరిగిందని ముఖ్యంగా యువత విద్యార్థులకు ఉద్యోగాలు గాని లేక యువత తీవ్రంగా నష్టపోయిందని యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని డీఎస్సీ మీద నారా చంద్రబాబునాయుడు గారు చేసిన సంతకంతో వేలాదిమంది విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు వెలుగులు వచ్చాయని ఈ కార్యక్రమంలో యువత విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున డిఎస్సీ క్వాలిఫై విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగింది ఈ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నూతలపాటి నాగభూషణం, సజ్జ అజయ్, మన్నవ వంశీకృష్ణ, రాయపాటి అమృత్ రావ్, స్వామి నిరుద్యోగ జేఏసీ నాయకులు శ్రీరామ్, నవీన్, ఎర్రం శ్రీనివాస్,మళ్లీ , శివ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!
కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్ లో మూతపడనున్న టీవీ9! దానికి కారణం ఏంటి?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
మదనపల్లెలో దారుణం! ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య!
నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!
వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!
నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APCM #DSC2024 #DSCNotification #Chandrababu #JobCreation #TDP #MegaDSC #EmploymentForUnemployed #TeacherPosts #TDPSupport
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.